

https://indianjobszone.com/
ఏపీపీఎస్సీ 47 పోస్టుల భర్తీకి 10 నోటిఫికేషన్లను సెప్టెంబరు 24న జారీ చేసింది. సహాయ ఇంజినీర్లు 11, ఏఎంవీఐ 1, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1 పోస్టులకు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సైనిక్ సంక్షేమంలో సంక్షేమ ఆర్గనైజర్ పోస్టులు 10, జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి పోస్టులు 7, జూనియర్ అకౌంట్స్ అధికారి కేటగిరీ-2లో 1, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ-3లో 4, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ-4లో 6 పోస్టులకు అక్టోబరు 9 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మత్స్యశాఖలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ 3, వార్డెన్ గ్రేడ్-1లో 1, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ 1, ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ 1 పోస్టుకు అక్టోబరు 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.