

దిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సీబీఎస్‌ఈ (CBSE) డేట్ షీట్‌లను విడుదల చేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ మేరకు తాత్కాలిక డేట్ షీట్‌లను విడుదల చేసింది. 2026 నుంచి పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అందుకనుగుణంగానే తాత్కాలిక డేట్‌షీట్‌లను రూపొందించింది. పదో తరగతి పరీక్షలను తొలి విడతలో ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు; రెండో ఎడిషన్ మే 15 నుంచి జూన్ 1వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ కంట్రోలర్ (ఎగ్జామ్స్) సన్యం భరద్వాజ్ వెల్లడించారు. (CBSE tentative Datesheets Released) మరోవైపు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు జరగనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సబ్జెక్టు పరీక్ష అనంతరం దాదాపు పది రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమై.. 12 రోజుల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఉదా: 12వ తరగతి ఫిజిక్స్ పరీక్ష ఫిబ్రవరి 20న జరిగితే.. మార్చి 3న మూల్యాంకనం ప్రారంభమై.. మార్చి 15 నాటితో ముగిసే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఈ పరీక్షల డేట్‌షీట్స్ తాత్కాలిమైనవేనని సీబీఎస్‌ఈ తెలిపింది. విద్యార్థులకు సంబంధించి ఆయా పాఠశాలలు పంపించిన తుది నివేదికల ఆధారంగా ఫైనల్ డేట్‌షీట్‌లను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. ఈసారి దాదాపు 45లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని సీబీఎస్‌ఈ భావిస్తోంది.
Join 𝗚𝗼𝗽𝗶 𝗜𝗻𝗳𝗼 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 WhatsApp Channel