

Aadhaar free update
ఆధార్ (Aadhaar) కార్డులో మీ అడ్రస్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి బయట కేంద్రాలకే వెళ్లనక్కర్లేదు. ఇంట్లోనే ఆన్లైన్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అందులో అడ్రస్ అప్డేట్ ఆప్షన్ కూడా ఉంది. ఆ ప్రక్రియ ఎలా అంటే..

ఈ పద్ధతి ఫాలో అయితే…
- ముందుగా myAadhaar పోర్టల్‌లోకి వెళ్లి.. లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- తర్వాతి స్క్రీన్‌లో 12-అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.
- అప్పుడు మీ మొబైల్‌కు OTP వస్తుంది. ఆ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- డ్యాష్‌బోర్డులో ఆధార్ సర్వీసు ఆప్షన్ల నుంచి అడ్రస్ ఛేంజ్‌ను ఎంచుకోవాలి.
- అక్కడ చూపించే మీ వివరాలు సరి చూసుకొని.. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- ఈ క్రమంలో డాక్యుమెంట్ సైజులు, నమోదు చేసిన వివరాలు సరి చూసుకొని సబ్మిట్ చేసి.. పేమెంట్ చేశాక SRN నెంబర్ వస్తుంది.
- దాంతో వెబ్సైట్లోకి వెళ్లి అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
- మీ వివరాలు అప్డేట్ అయినట్లు మొబైల్‌కు మెసేజ్ వచ్చాక పై వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.