EPF Withdraw Rules
EPF Money Withdraw || ఈపీఎఫ్ ఖాతాదారులకు EPFO శుభవార్త చెప్పింది. గతంలోలాగ కారణాలు తెలపకుండా కొన్ని సందర్భాలలో 100% శాతం వరకు అర్హత ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.
EPF Withdraw Rules: న్యూఢిల్లీ: ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. పీఎఫ్ ఉపసంహరణ విషయంలో వారికి భారీ ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి, యజమాని వాటాతో సహా PF ఖాతాలోని విత్ డ్రాకు వీలున్న నగుదు 100% వరకు ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 238వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశానికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆ శాఖల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వందన గుర్నాథని, కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి కూడా హాజరయ్యారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలలో.. ఉద్యోగి, యజమాని వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్‌లోని అర్హత కలిగిన బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు ఖాతాదారులు విత్ డ్రా చేసుకోవచ్చు అనేది కీలకం.

ప్రస్తుతం PF విత్ డ్రా రూల్స్
గతంలో నిరుద్యోగం లేదా పదవీ విరమణ విషయంలో మాత్రమే ఖాతాదారులను నగదు పూర్తి ఉపసంహరణ అనుమతి ఉండేది. ఒక సభ్యుడు ఉద్యోగం లేకుండా ఉన్న 1 నెల తర్వాత PF బ్యాలెన్స్‌లో 75 శాతం నగదు, 2 నెలలు ఖాళీగా ఉన్న తర్వాత మిగిలిన 25 శాతం నగదు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఉండేది. పదవీ విరమణ తర్వాత పూర్తి బ్యాలెన్స్‌ను ఎటువంటి కండీషన్ లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు.
అనుమతించిన గరిష్ట పాక్షిక విత్ డ్రా 90%
భూమి కొనుగోలు లేదా కొత్త ఇంటి నిర్మాణం లేదా EMI చెల్లింపు కోసం పాక్షిక ఉపసంహరణ విషయంలో, EPF సభ్యులు పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 90% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. విత్ డ్రా నియమాలను సులభతరం చేయడానికి సీబీటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
– EPF సభ్యుల అవసరాల నిమిత్తం CBT ఈపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రా కోసం 13 సంక్లిష్ట నిబంధనలను ఒకే నిబంధనగా క్రమబద్ధీకరించింది. వాటిని ముఖ్యమైన అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం), గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అని 3 కేటగిరీలుగా విభజించింది.
విత్ డ్రా లిమిట్స్ సరళీకరణ
– విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు పాక్షికంగా విత్ డ్రాకు అనుమతించారు. ప్రస్తుతానికి వివాహం & విద్య కోసం మొత్తం 3 పాక్షిక విత్‌డ్రా నుంచి పరిమితి పెంచారు.
– అన్ని పాక్షిక విత్‌డ్రా నియమాలలో ఖాతాదారుడి సర్వీసును 12 నెలలకు తగ్గించారు.
– ఇప్పటివరకు ఉన్నట్లుగా ప్రత్యేక పరిస్థితులు కింద పాక్షిక ఉపసంహరణకు కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో నిరుద్యోగం, వ్యాధులు, సంస్థల మూసివేత, ప్రకృతి వైపరీత్యాలు లాంటి తమ కారణాలు వెల్లడించాల్సి వచ్చేది. ఇది తరచుగా క్లెయిమ్‌లను తిరస్కరించడానికి దారితీసేది.
పీఎఫ్ ఖాతాదారుడు 25 శాతం మినిమం బ్యాలెన్స్‌ను నిర్వహించాలి. ఇందుకోసం కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలా చేయడం ద్వారా ఈపీఎఫ్‌వో నుంచి రిటైర్మెంట్ ప్రయోజనాలను పెద్ద మొత్తంలో పొందవచ్చు, అధిక విలువ కలిగిన పదవీ విరమణ కార్పస్‌ను కూడబెట్టుకోవడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
పాక్షిక ఉపసంహరణ కోసం క్లెయిమ్‌ల 100% ఆటో సెటిల్‌మెంట్
విత్ డ్రా కోసం కొన్ని సందర్భాలలో డాక్యుమెంటేషన్ అవసరం లేదు. దాంతో పాక్షిక ఉపసంహరణ కోసం క్లెయిమ్ 100% ఆటో సెటిల్‌మెంట్‌కు అవకాశముంది. ఈపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ వ్యవధిని 2 నెలల నుంచి 12 నెలలకు, ఫైనల్ పెన్షన్ ఉపసంహరణకు గడువును 2 నెలల నుంచి 36 నెలలకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
పైన పేర్కొన్న వాటికి అనుబంధంగా, EPF యొక్క అకాల తుది సెటిల్‌మెంట్‌ను పొందే వ్యవధిని ప్రస్తుత 2 నెలల నుండి 12 నెలలకు మరియు తుది పెన్షన్ ఉపసంహరణను 2 నెలల నుండి 36 నెలలకు మార్చాలని కూడా నిర్ణయించబడింది. పాక్షిక ఉపసంహరణల సరళీకరణ సభ్యులు వారి పదవీ విరమణ పొదుపులు లేదా పెన్షన్ హక్కులను రాజీ పడకుండా తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలరని నిర్ధారిస్తుంది.
ఏ రాజీ లేకుండా సభ్యులు తమ పదవీ విరమణ పొదుపులు లేదా పెన్షన్ సెటిల్మెంట్ జరిగేలోపు పాక్షిక ఉపసంహరణలతో సభ్యులు తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలరు.