
Notice From UIDAI
ఆధార్ కార్డు కలిగినవారికి ముఖ్యమైన గమనిక: ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేది, బయోమెట్రిక్ వివరాలు మార్చడానికి వచ్చే సేవా ఛార్జీలు (Service charges) పెరిగాయి. యూఐడీఏఐ ఇది ప్రకటించింది, ఇది దాదాపు ఐదేళ్ల తర్వాత జరుగుతున్న తొలి సవరణ.

మినహాయింపులు (Free Services charges )
- 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పూరించిన పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ (update) ఉచితం
- కొత్తగా పుట్టిన పిల్లల ఆధార్ నమోదు కూడా ఉచితం
కొత్త ఛార్జీలు
- డెమోగ్రాఫిక్ అప్‌డేట్ : పేరు, చిరునామా, పుట్టిన తేది మార్చడానికి : రూ.50 → రూ.75
- బయోమెట్రిక్ అప్‌డేట్ : వేలిముద్రలు, కనుపాప మార్పు కోసం : రూ.100 → రూ.125
- ఈ కొత్త రేట్లు 2028 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయి, ఆ తర్వాత సమీక్ష జరుగుతుంది.
ఇంటి వద్ద సేవల (హోమ్ ఎన్‌రోల్‌మెంట్) రేట్లు
- ఇంట్లోనే ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ : జీఎస్టీతో కలిపి రూ.700
- ఒకే ఇంట్లో ఎక్కువ మంది సర్వీస్ తీసుకుంటే:
- మొదటి వ్యక్తికి రూ.700
- ప్రతి అదనపు వ్యక్తికి రూ.350 చార్జ్