February 15, 2026

పీఎం కిసాన్ లబ్దిదారులు కేంద్రం తీపికబురు అందించింది. పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేసేందుకు ముహూర్తం ఖారారు చేసింది. మార్చి తొలి వారంలో నగదును విడుదల చేయనుందని తెలుస్తోంది. దీంతో రైతులందరూ ఈ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. సింపుల్‌గా దీనిని పీఎం కిసాన్‌గా పిలుస్తారు. ప్రతీ ఏడాది ఈ పథకం ద్వారా ఐదు ఎకరాల్లోపు పోలం ఉన్న రైతులకు రూ.6 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తోంది. ఏడాదిలో మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత సొమ్ము కోసం రైతులు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధుల విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాదికి సంబంధించిన తొలి విడత రూ.2 వేల సొమ్ము త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు మార్చి తొలివారంలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రిలీజ్ చేయనున్నారని సమాచారం.

పీఎం కిసాన్ నగదును రైతులు తమ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయ ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. ఇష్టానుసారం దేనికైనా ఖర్చు చేసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ సాయం పొందుతున్నారు.

పీఎం కిసాన్ లబ్దిదారుల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. నాలుగు నెలలకు ఒకసారి నగదును కేంద్రం విడుదల చేస్తోంది. అలాగే అనర్హులను కేంద్రం ఎప్పటికప్పుడు గుర్తించి వారిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. ఇటీవల కూడా కొంతమంది లబ్దిదారులను జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

పీఎం కిసాన్ సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. ఇక బ్యాంక్ అకౌంట్, ఆధార్ అనుసంధానం పూర్తి అయ్యి ఉండాలి. ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ కాదు. దీంతో రైతులు ఈ పనులు చేయాలని కేంద్రం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)