October 13, 2025

ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎగ్జామ్స్

ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. జనరల్‌ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు; ఒకేషనల్‌ కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండు సెషన్లలో ఉంటాయని తెలిపింది.

ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు (ఆదివారాల్లో సహా) రెండో సెషన్‌ ఉంటాయని తెలిపింది. అయితే, ఇది తాత్కాలిక షెడ్యూల్‌ మాత్రమేనని.. పండుగల్లో సెలవుల దృష్ట్యా అవసరమైతే ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి డా.నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు. పూర్తి టైం టేబుల్‌ని ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

AP Intermediate Public Theory Examinations Shedule

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *