Code on Wages -2019 :
ఉద్యోగ మార్పు సమయంలో F&F సెటిల్‌మెంట్ కోసం దీర్ఘకాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ‘కోడ్ ఆన్ వేజెస్ 2019’ కింద తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం, ఉద్యోగి కంపెనీని విడిచిన రెండు పనిదినాల్లోపే పూర్తి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు 2026 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది.

ఉద్యోగి కంపెనీని విడిచిన రెండు పనిదినాల్లోపే పూర్తి బకాయిలు…
ఉద్యోగ మార్పు సమయంలో నెలల తరబడి ఫుల్ అండ్ ఫైనల్ (F&F) సెటిల్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సిన రోజులు ముగియనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోడ్ ఆన్ వేజెస్ 2019 కింద కొత్త నిబంధన ప్రకారం, ఉద్యోగి కంపెనీని విడిచిన రెండు పనిదినాల్లోపే పూర్తి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉద్యోగులు తమ చివరి జీతం, బోనస్‌లు, ఇతర బకాయిల కోసం 40–45 రోజులు, కొన్నిసార్లు 90 రోజుల వరకు కూడా వేచి ఉండాల్సి వచ్చేది. ఈ ఆలస్యం వల్ల ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి పెరుగుతుండేది. కొత్త నిబంధనతో ఈ సమస్యలకు ముగింపు పలికినట్లు అయింది.
ఈ నిబంధన అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది. ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, సంస్థ నుంచి తొలగించబడినా లేదా కంపెనీ మూసివేయబడినా ప్రతి సందర్భంలోనూ రెండు రోజుల్లోపే FnF చెల్లింపు తప్పనిసరి.
ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ఏం ఉంటాయి?
- చివరి పనిదినం వరకు జీతం
- వినియోగించని సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్
- బోనస్‌లు, ప్రోత్సాహకాలు
- ఆఫీసు ఖర్చుల రీయింబర్స్మెంట్
- అవసరమైన తగ్గింపులు (పన్నులు, అడ్వాన్స్‌లు మొదలైనవి)