April 10, 2026

భారతదేశంలో అసంఘటిత రంగంలో (Unorganized Sector) పనిచేస్తూ, ఎలాంటి సామాజిక భద్రత లేకుండా శ్రమిస్తున్న కోట్లాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సన్నద్ధమవుతోంది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కేవలం సంఘటిత రంగానికే (Organized Sector) పరిమితమైన ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (EPFO), ‘ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ’ (ESIC) సేవలను అసంఘటిత రంగ కార్మికులకు కూడా విస్తరించే అంశంపై కేంద్రం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది.

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ కీలక (EPFO) ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చారు. దేశంలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పదవీ విరమణ తర్వాత కచ్చితమైన పింఛను (Pension) అందాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయమని ఆమె సభకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)