March 25, 2026

EPFO : ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు అనేక అనుమాలు ఉంటాయి. పీఎఫ్ అకౌంట్లకి సంబంధించి అనేక రూల్స్ కేంద్రం ప్రవేశపెట్టింది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై కేంద్రం వడ్డీ జమ చేస్తూ ఉంటుంది. ఈ వడ్డీపై ట్యాక్స్ ఉంటుందా.. లేదా అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం 

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అనేక విషయాల్లో గందరగోళం ఏర్పడుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉండి వాటిని విలీనం చేయకపోతే కేంద్రం నుంచి వార్షిక వడ్డీ రాలేదని భావిస్తుంటారు.ఇక అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ జమ కాదని, ఇక వడ్డీపై ట్యాక్స్ ఉంటుందని చాలామందికి సందేహాం ఉంటుంది. అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ రాదా.. వీటిపై పన్ను పడుతుందా.. అకౌంట్ ఇనాక్టివ్ అయితే ఎలా యాక్టివ్ చేసుకోవాలి.. ఇలా పీఎఫ్ ఖాతాదారులకు ఉండే అనేక అనుమానాలకు సమాధానాలు ఇక్కడ చూద్దాం.

మీరు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారినప్పుడు కొత్త పీఎఫ్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అవుతుంది. పాత అకౌంట్‌ను కొత్త అకౌంట్‌లో విలీనం చేయకపోతే.. ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలు ఉండవచ్చు. ఒకవేళ మూడేళ్ల పాటు కాంట్రిబ్యూషన్ ఆగిపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇనాక్టివ్ అయినా మీకు వడ్డీ జమ అవుతుంది.

58 ఏళ్లు వచ్చేంతవరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత వడ్డీ చెల్లింపు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అయితే పీఎఫ్ చెల్లింపు చేసిన తేదీ నుంచి పదవీ విరమణ వరకు మీ డబ్బుపై చెల్లించే వడ్డీపై పన్ను వర్తిస్తుంది. ఈపీఎఫ్ డబ్బుపై పన్ను ఉండదు. కానీ వడ్డీపై మాత్రం ఉంటుందని గుర్తించుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)