ప్రజలకు ప్రత్యేకమైన ఆన్లైన్ పోటీ నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO Tagline) తాజాగా ప్రకటించింది. సంస్థ ఆశయాలు, విధులకు అద్దం పట్టేలా ఓ అర్థవంతమైన ట్యాగ్(Tag line)ను సూచించాలని ప్రజలను కోరింది. కంపెనీకి చెందిన వెబ్‌సైట్‌కు ఆన్లైన్ ట్యాగ్‌ను పెట్టాలనుకున్న భవిష్యనిధి సంస్థ దీనికోసం ఓ ప్రకటనను విడుదల చేసింది. మంచి ట్యాగ్‌లైన్‌ను సూచించిన ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేసి.. వారికి నగదు బహుమతులు (Cash Reward) సైతం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మొదటి బహుమతిగా రూ.21వేలు, రెండో బహుమతిగా రూ.11వేలు, మూడో బహుమతిగా రూ.5,100 ఇవ్వనున్నట్లు తెలిపింది. విజేతలకు త్వరలో దిల్లీలో నిర్వహించనున్న ఈపీఎఫ్ఓ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది.

అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ పోటీ ఈనెల 10వరకు కొనసాగుతుందని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ తెలిపింది. ఇంకా సమయం ఉన్నందున ప్రజలు పెద్ద ఎత్తున పోటీలో పాల్గొనాలని కోరింది. పోటీకి సంబంధించిన సమాచారం కోసం ఇతర విషయాలు తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ ( EPFO ) ట్విటర్ అధికారిక ఖాతాలో ఓ క్యూఆర్ కోడ్‌ను విడుదల చేసింది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. పోటీలో పాల్గొనేవారు రూపొందించిన ట్యాగ్‌లను అప్లోడ్ చేయొచ్చు.
CLICK HERE FOR PARTICIPATION : EPFO Online TAG LINE Contest