

- గత ఏడాది విడుదలైన ఫ్లాగ్లిప్ ఫోన్లపై రెండు సంస్థల భారీ ఆఫర్లు టెక్రియులను ఆకర్షి స్తున్నాయి. యాపిల్, శామ్సంగ్, గూగుల్, తదితర కంపెనీ లకు చెందిన ప్రీమియం ఫోన్లు తక్కువ ధరకే దొరుకుతుండడంతో జోరుగా కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఎన్నడూ లేని విధంగా ఐఫోన్ ప్రో మోడల్స్పై
యాపిల్ మంచి ఆఫర్లు ప్రక టించింది. • ఎంపిక చేసుకున్న ఫోన్ ఇంటికి చేరిన తర్వాత
జాగ్రత్తగా ఉండాలి.
కొంతమంది ఆన్లైన్ అమ్మకందారులు అసలు బదులు నకిలీలను, వాడిన వాటిని డెలివరీ చేసి మోసం చేస్తున్నారు.
ఏం చేయాలంటే… - ఆర్డర్ ఇచ్చిన వస్తువే వచ్చిందో లేదో తెలుసుకునేం దుకు.. మీరు ఓపెన్ బాక్స్
డెలివరీని ఎంచుకోవాలి. - ఆన్లైన్లో మొబైల్ను కొను గోలు చేసే సమయంలోనే ఈఆప్షన్ న్ను సెలెక్ట్ చేసుకోవాల్సి
ఉంటుంది. - దీనివల్ల ఆ ఉత్పత్తిని ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్, మన ముందే పెట్టెను తెరిచి చూపుతాడు.
- దానిని చెక్ చేసుకుని, ఆన్ చేసుకునే వరకు ఆసాంతం వీడియో తీసుకోవాలి. ఏదైనా తేడా గమనిస్తే.. వెంటనే వెనక్కి పంపించాలి.
- మొబైల్ను చూసిన తర్వాత కూడా కొన్ని తనిఖీలు అవసరం. అది అసలైనదా? లేక నకిలీదా? అన్న విషయాన్ని ధ్రువీకరించుకోవాలి. చైనా, బ్యాంకాక్, థాయ్లాండ్, తదితర దేశాల్లో తయారైన నకిలీ ఫోన్లను కూడా ఈ సమయంలో కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. కొందరైతే గతంలో యాక్టివేట్ చేసిన ఫోన్లను కూడా అమ్మేస్తున్నారు.…
- ఎలా గుర్తించాలి….
కేంద్ర టెలికం విభాగం రూపొందించిన sanchar saathi యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్లి ధ్రువీకరించుకోవచ్చు. ఈ యాప్ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. - తొలుత. మీ పేరుతో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత citizen centric services లోకి వెళ్లి.. know genuineness of your mobile handset అన్న ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అందులో మీ ఫోన్ తాలూకూ 15 అంకెల IMEI నంబరు నమోదుచేయాలి. అనంతరం సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేస్తే..నంబరు తాలూకు వివరాలు కనిపిస్తాయి.
- వాటిలో.. స్టేటస్, బ్రాండ్ పేరు, మోడల్ పేరు, తయారీదారు పేరు, పరికరం, వంటి వివరాలూ ఉంటాయి. స్టేటస్ లో వాలిడ్ అని వస్తే.. మీ ఫోన్ అసలైందని, ఇన్వాలిడ్ అని వస్తే.. నకిలీదని అర్థం.
ఐఎంఈఐ నంబరు… సరిచూడండి! - మనకు వేలిముద్రలు ఉన్నట్లే.. మొబైళ్లకు కూడా విశిష్ఠ సంఖ్యలు ఉంటాయి. IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ), సీరియల్ నంబర్లతో గుర్తించవచ్చు. ఏ రెండు మొబైల్ ఐఎం ఈఐ నంబర్లు ఒకే విధంగా ఉండవు. వీటి ద్వారా ఆ పరికరం అసలా? నకిలీనా అని గుర్తించవచ్చు.
ఈ నంబరును ఎలా తెలుసుకోవాలంటే…
సీరియల్ నంబరూ కీలకమే....
మొబైల్ సీరియల్ నంబరు కూడా కీలకమే. దీనిని ఆ ఫోన్ తయారీ సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
- మీ ఫోన్ పెట్టెపై ఇది ముద్రించి ఉంటుంది. రెండు SIM CARDS ఉంటే.. రెండు ఐఎంఈఐ నంబర్లు ఉంటాయి. 2. *#06# అని టైప్ చేసి డయల్ చేయాలి. వెంటనే తెరపై ఐఎంఈఐ, సీరియల్ నంబరు కనిపిస్తాయి.
- మొబైల్ లోని సెట్టింగ్స్లోకి వెళ్లి About phone ఆప్షన్పై క్లిక్ చేస్తే ఐఎంఈఐ నంబరుతోపాటు సీరియల్ నంబరు కూడా వస్తుంది.
- అప్పటికే యాక్టివేట్ చేసిన ఫోన్ అయితే.. ఎప్పుడు చేశారు? అసలు వారంటీ ఉందా? ఇంకా ఎన్ని నెలలు ఉంది? తదితర వివరాలతో పాటు, రీఫర్బిష్ చేసిన మొబైల్ అయితే ఆ సమాచారం కూడా తెలుస్తుంది.