New Financial Year 2026–27 Key Updates :
కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పన్ను విధానం నుండి బ్యాంకింగ్ వరకు సామాన్యుడి దైనందిన జీవితంపై ప్రభావం చూపబోయే అంశాలు మీకోసం.

కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం :
ఆర్థిక సంవత్సరం 1961 నాటి చట్టం స్థానంలో ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025’ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులకు గందరగోళంగా ఉన్న ‘అసెస్మెంట్ ఇయర్ ’, ‘ప్రీవియస్ ఇయర్ ’ వంటి పదాల స్థానంలో సులభంగా అర్థమయ్యేలా ‘పన్ను సంవత్సరం అనే పదాన్ని ఉపయోగించనున్నారు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87ఏ కింద రిబేట్ పెంచడంతో, రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభించనుంది. ఫారం-16 స్థానంలో కొత్తగా ఫారం-130, 131లు రానున్నాయి. పాన్ కార్డు కోసం పుట్టిన తేదీ రుజువుగా ఆధార్‌ను అంగీకరించరు. కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ మాత్రమే అవసరం. భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు అనుకూలంగా రైలు టికెట్ రద్దు నిబంధనలను రైల్వే శాఖ సవరించింది. పూర్తి రిఫండ్ పొందాలంటే రైలు బయల్దేరడానికి 8 గంటల ముందే టికెట్ రద్దు చేసుకోవాలి . 8 నుండి 24 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం రిఫండ్ లభిస్తుంది. అలాగే, కొన్ని ప్రధాన బ్యాంకులు తమ ఏటీఎం, డెబిట్ కార్డు నిబంధనలను మార్చాయి. HDFC, బంధన్ బ్యాంకులు ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 23 వసూలు చేయనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డుల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని రూ. 75,000 నుండి రూ. 50,000కి తగ్గించింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ (LPG), సీఎన్జీ (CNG) మరియు విమాన ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది రవాణా ఖర్చులపై నేరుగా ప్రభావం చూపనుంది.
EPFO (పీఎఫ్) మార్పులు :
లిమిట్ పెంపు: పీఎఫ్ విత్ డ్రాయల్ ఆటో-సెటిల్మెంట్ లిమిట్‌ను ₹5 లక్షల వరకు పెంచారు.
ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్: ఉద్యోగం మారినప్పుడు మీ పీఎఫ్ ఖాతా పాత కంపెనీ నుండి కొత్త కంపెనీకి ఆటోమేటిక్ గా బదిలీ అవుతుంది.