February 16, 2026

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈపీఎఫ్ సౌకర్యం కలిగి ఉన్నారు. వీరికి ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుందని తెలుస్తోంది. దీనివల్ల ఈపీఎఫ్ క్లెయిమ్స్‌లో వేగం పెరగనుంది.

ఈపీఎఫ్‌వో 3.0 ఫ్లాట్‌ఫామ్‌లో పేపర్ వర్క్ ఉండదు. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోతాయి. సిబ్బంది వివరాలను చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. మెడికల్ ఎమర్జెన్సీ. పెళ్లి, ఎడ్యుకేషన్ అవసరాల కోసం చేసుకునే క్లెయిమ్స్ మరింత వేగంగా ప్రాసెస్ అవుతాయి. కొత్త విధానంలో కేవలం మూడు రోజుల్లో పీఎఫ్ నగదు సెటిల్మెంట్ జరుగుతుందని కార్మికశాఖ సహాయమంత్రి శోభ కరాండ్లేజ్ ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారు. అటు ఏప్రిల్ 1 నుంచి కొత్త యాప్‌ను ఈపీఎఫ్‌వో తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా ఉద్యోగులు ఒకేచోట పీఎఫ్ సేవలు పొందవచ్చు. ఉమాంగ్, యూఏఎన్ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి వెళ్లాల్సిన అవసంర లేదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త యాప్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మొత్తానికి కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి ఉద్యోగులు కొత్త మార్పులను చూడవచ్చు. ఈ మార్పులతో పీఎఫ్ సేవల్లో వేగం పెరగనుందని చెప్పవచ్చు. దీంతో ఈ అప్డేట్స్ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈపీఎఫ్‌వో క్లెయిమ్ కోసం 20 రోజుల సమయం పడుతుంది. మాన్యువల్‌గా ఈపీఎఫ్‌వో సిబ్బంది పరిశీలించి క్లెయిమ్ ఆమోదించడం లేదా రిజెక్ట్ చేయడం చేస్తున్నారు. కానీ త్వరలో ఆటోమోడ్ ఆప్షన్ తీసుకురానున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఈపీఎఫ్ క్లెయిమ్స్ వేగంతంగా ప్రాసెస్ అవుతాయి. మాన్యువల్ జోక్యం లేకుండా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు జరపుతారు. ప్రస్తుతం క్లెయిమ్ రిక్వెస్ట్ కోసం డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిని అధికారులు ధృవీకరణ చేపట్టడం వల్ల ప్రక్రియ ఆలస్యమవుతుంది. కానీ కొత్త ఫ్లాట్‌ఫామ్‌లో పేపర్ వర్క్ ఉండదు. ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ ద్వారా సులభంగా, వేగంగా క్లెయిమ్స్ జరుగుతాయి.

ఈపీఎఫ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈపీఎఫ్ సేవలను ఉద్యోగులు సులభంగా, వేగవంతంగా పొందేలా కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది. ఈపీఎఫ్‌ నగదు ఉపంసహరణ, వివరాలు అప్డేట్, ఫిర్యాదులు వేగంతంగా పరిష్కారం కోసం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా త్వరలో ఈపీఎఫ్‌వో 3.0 వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక నుంచి ఈపీఎఫ్ విత్ డ్రాలు మరింత వేగంగా జరనున్నాయి. రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం ఆటోమోడ్ ఫీచర్‌ను ఈపీఎఫ్‌వో రూపొందిస్తోంది. ఈ ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)