July 27, 2026

ప్రయాణికులకు Tatkal Tickets Booking ను సులభతరం చేయడానికి, తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయంతోనే టికెట్ల పంపిణీ సమయాన్ని కూడా నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల ప్రయాణికులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు రెండుసార్లు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

పశ్చిమ మధ్య రైల్వే తత్కాల్ బుకింగ్ ప్రక్రియలో మార్పులను ప్రకటించింది. ఆగస్టు 1 నుండి కొత్త టికెట్‌ నిబంధనలను అమలు చేయనుంది. టికెట్ కౌంటర్ల వద్ద బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, రద్దీని తగ్గించడం, ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడం ఈ మార్పుల లక్ష్యం. నివేదిక ప్రకారం, ప్రయాణికులకు ప్రక్రియను సులభతరం చేయడానికి, తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయంతోనే టికెట్ల పంపిణీ సమయాన్ని కూడా నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పశ్చిమ మధ్య రైల్వే జోన్‌లో కొత్త సమయాల మార్పులు.. AC తరగతుల టికెట్స్‌ ఉదయం 8:30 నుండి 9:00 గంటల వరకు, NON-AC తరగతుల టికెట్స్‌ ఉదయం 9:00 నుండి 9:30 గంటల వరకు బుక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం, AC కోచ్‌లలో తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఉదయం 9:00 నుండి 9:25 గంటల మధ్య టికెట్స్‌ లభిస్తుండగా, SLEEPER CLASS లో తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఉదయం 9:30 నుండి 9:55 గంటల మధ్య లభిస్తున్నాయి.

ప్రస్తుత ఉన్న విధానం ప్రకారం, ఏసీ, స్లీపర్ తరగతులకు ఉదయం 8 గంటల నుండి టోకెన్లు పంపిణీ చేయడం మొదలవుతుంది. ఏసీ తత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ టికెట్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. టికెట్లు ఇవ్వడానికి, టికెట్ బుకింగ్ చేయడానికి మధ్య ఎక్కువ సమయం పట్టడం వల్ల, ప్రయాణికులు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. టోకెన్ పొందిన తర్వాత, వారు తిరిగి రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త విధానాన్ని అమలు  చేస్తున్నారు. ఈ కొత్త విధానం ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది. అలాగే అనవసరమైన రద్దీని తగ్గిస్తుంది.  సౌకర్యం, పారదర్శకతను నిర్ధారించడానికి , దళారుల ఇబ్బందులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ రైల్వే కమిషనర్ సౌరభ్ కటారియా తెలిపారు. ప్రతి కౌంటర్‌లో ఏసీకి గరిష్టంగా 10 టికెట్స్‌, నాన్-ఏసీకి 15 టికెట్స్‌ ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)