Andhra Pradesh Housing Scheme – 2026 :
ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఊరట కలిగించారు. కొత్త ఇళ్ల నిర్మాణంపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ఆర్టీజీఎస్ అభివృద్ది చెందిన అవేర్ 2.0 మొబైల్ యాప్ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరో 5 లక్షల ఇళ్లను నిర్మించాలని, వీటిని పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. టిడ్కో ఇళ్లకు అదనంగా ఈ 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వీలైనంత త్వరగా వీటిని లబ్దిదారులకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థలాల పంపిణీ ప్రక్రియ వేగవంతం :
ఇక ఇళ్ల నిర్మాణంతో పాటు మరోవైపు స్థలాల పంపిణీ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దాదాపు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కావాల్సిందిగా కోరారని, వీరికి అందించేలా ప్రణాళికలు రచించాలని కోరారు. అలాగే ఇసుక సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడాలన్నారు. రాబోయే వర్షాకాలంలో ఇసుక రవాణాకు ఇబ్బంది కలిగే అవకాశముందని, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇసుకకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఏడాది మరోసారి సామూహిక గృహప్రవేశాలు ఒకేసారి భారీగా చేపడతామని తెలిపారు. టిడ్కో ఇళ్ల పనులను కూడా వేగవంతం చేయాలని కోరారు.