August 9, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది తొలి విడతలో తల్లికి వందనం డబ్బులు రాని వారికి మరో అవకాశం కల్పించింది.సంవత్సరం కొత్తగా స్కూళ్లలో చేరిన అర్హులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అన్నింటినీ పరిశీలించి మరో విడత తల్లికి వందనం డబ్బులు విధుల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కూటమి ప్రభుత్వం ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బులను తొలి విడతగా ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. అయితే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా తొలి విడతలో డబ్బులు పొందని వారికి, అలాగే ఈసారి కొత్తగా స్కూళ్లలో చేరి తల్లికి వందనం డబ్బులు అందని వారికి ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది.

తొలి విడతలో అర్హులై ఉండి ‘తల్లికి వందనం’ డబ్బులు రాని విద్యార్థుల జాబితాను గుర్తించి.. సామాజిక తనిఖీల కోసం గత నెల 21నే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ సచివాలయాలు/, వార్డుల్లో అందుబాటులో ఉంచింది. ఈ జాబితాలో ఉన్న విద్యార్థులు తమ అభ్యంతరాలను ఆధారాలతో సహా సమర్పిస్తే.. వాటిని పరిశీలించి రెండో విడతలో వారి అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఇందుకు ఈ నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తులను కూడా స్వీకరించింది.మొత్తం 4,470 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరి అర్హతలను మరోసారి పరిశీలించి.. ఈ నెల 30వ తేదీన ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హులైన విద్యార్థుల జాబితాలను అధికారులు విడుదల చేస్తారు. అదే సమయంలో తల్లికి వందనం తొలి విడత డబ్బులు పొందని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)