Aadhaar Rules After Death :
మన దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యం. పుట్టినప్పడి నుంచి మరణించేంత వరకు అన్నింటికి ఆధార్ కార్డు కావాల్సిందే. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా, మనం ఎవరనేది గుర్తించాన్నా ఆధార్ ఎంతో కీలక. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డ్ పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా డియాక్టివేట్ చేయాలో అని మీరెప్పుడైనా ఆలోచించారా? మీకు ఈ డౌట్ వచ్చి ఉంటే కచ్చితంగా ఇది తెలుసుకోండి.

భారత దేశంలోని పౌరుడికి ఆధార్ గుర్తింపు కార్డు ఎంతో ముఖ్యం. ఓ పౌరుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రభుత్వం పథకాలు, చివరకు మరణ దృవపత్రం పొందాలన్నా కూడా ఆధార్ ఉండాల్సిందే. అయితే కొన్ని సార్లు వీటిని మనం ఎక్కడైనా పావరేసుకుంటే.. అది దొరికిన వారు వాటిని దుర్వినియోగం చేయవచ్చు. ముఖ్యంగా చనిపోయిన వారి ఆధార్ కార్డ్స్‌తో ఎక్కువ నేరాలకు పాల్పడుతూ ఉంటారు కేటుగాళ్లు. అయితే దీనిపై దృష్టిసారించిన UIDAI ఈ సమస్యకు చెక్ పెట్టేందకు సరికొత్త విధాన్ని తీసుకొచ్చింది. అదే డియాక్టవేట్ ఆప్షన్, చనిపోయిన వ్యక్తి ఆధార్‌ను ఎవరూ యూజ్ చేయకుండా మనం దానిని ఆన్లైన్లోనే డియాక్టీవేట్ చేయవచ్చు.
డీయాక్టివేట్ చేయడం ఇలా….
- మీరు ఎవరైనా చనిపోయిన వారికి ఆధార్‌ను డీయాక్టీవేట్ చేయడానికి ముందుగా మీ ఫోన్లో UIDAI యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా నేరుగా బ్రౌసర్ నుంచైనా చేయవచ్చు.
- ఇందుకోసం మీరు బ్రౌసర్లో ‘మై ఆధార్’ పోర్టల్‌లోకి వెళ్లాలి
- తర్వాత కుటుంబ సభ్యుల్లోని ఎవరైనా ఒకరి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి
- తర్వాత మీకు ‘Report Death of a Family Member’ అనే ఆప్షన్‌ను కనిపిస్తుంది
- ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి, తర్వాత మరణించిన వ్యక్తి ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి
- అలాగే మరణ దృవపత్రంపై ఉన్న రిజిస్ట్రేషన్ నంబరును కూడా ఎంటర్ చేయాలి, అలాగే ఇమేజ్ కూడా యాడ్ చేయాలి
- వివరాలను వెరిఫై చేసిన తర్వాత ఉడాయ్ మృతుడి ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది