AP Inter Supplementary Hall Tickets 2026 :
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2026 పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు తాజాగా జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in తోపాటు మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009 నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని, సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులతోపాటు సెకండ్ ఇయర్ విద్యార్ధులు కూడా ఫెయిలైన సబ్జెక్టులు, ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ పరీక్షలకు హాజరుకావచ్చు. ఇక ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4, 2026వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఇంటర్ సప్లిమెంటరీ 2026 పూర్తి టైమ్ టేబుల్ :
1.ఇంటర్ ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 5, 2026 న ఉంటుంది.
2.ఎన్విరాన్‌మెంటర్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6, 2026 (శనివారం) ఉంటుంది.
3.ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి జూన్ 11, 2026 వరకు ఉంటాయి.
NOTE : ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.
- మే 21 (గురువారం) ఇంటర్ ఫస్ట్ ఇయర్ ల్యాంగ్వేజెస్ (Paper-1), సెకండ్ ఇయర్ ల్యాంగ్వేజెస్ Paper 2
- మే 22 (శుక్రవారం) ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్ 1, సెకండ్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్ 2
- మే 23 (శనివారం) ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ 1, సెకండ్ ఇయర్ బోటనీ, హిస్టరీ పేపర్ 2
- మే 25 (సోమవారం) ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ 1, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, సివిక్స్ పేపర్ 2
- మే 26 (మంగళవారం) ఫస్ట్ ఇయర్ బోటనీ పేపర్ 1, సెకండ్ ఇయర్ జువాలజీ, ఎకనామిక్స్ పేపర్ 2
- మే 28 (గురువారం) ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ 1, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ 2
- మే 29 (శుక్రవారం) ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 1, సెకండ్ ఇయర్ కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
- మే 30 (శనివారం) ఫస్ట్ ఇయర్ కామర్స్ పేపర్ 1, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 2
- జూన్ 1 (సోమవారం) ఫస్ట్ ఇయర్ సివిక్స్ పేపర్ 1, సెకండ్ ఇయర్ జాగ్రఫీ, మోడర్న్ ల్యాంగ్వేజ్, బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ పేపర్ 2 (BPC విద్యార్థులకు)
- జూన్ 2 (మంగళవారం) ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ 1, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ 2
- జూన్ 3 (బుధవారం) ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , లాజిక్ పేపర్ 1, సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , లాజిక్ పేపర్ 2
- జూన్ 4 (గురువారం) ఫస్ట్ ఇయర్ మోడర్న్ ల్యాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 1