RRB Technician Recruitment Notification 2026 :
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి సంబంధించి ఆర్‌ఆర్‌బీ (RRB) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిపికేషన్ కింద మొత్తం 6,565 రైల్వే టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 21 ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో భర్తీ :
సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, ముంబయి, అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బిలాస్‌పూర్, చండీగఢ్, గువాహటి, గోరఖ్పూర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, , సిలిగురి, తిరువనంతపురం ఇలా మొత్తం 21 ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేస్తారు.

పోస్టుల వివరాలు :
ఆర్‌ఆర్‌బీ విడుదల చేయనున్న ఈ నోటిఫికేషన్లో మొత్తం 6,565 పోస్టులను భర్తీ చేయనున్నారు.
- టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుల సంఖ్య : 6,242
- టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుల సంఖ్య : 323
అర్హతలు :
అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది.
వయోపరిమితి :
- ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితితో సడలింపు ఛాన్స్ కూడా ఉంటుంది.
- ఆర్‌ఆర్‌బీ నుంచి విడుదల కానున్న ఈ నోటిఫికేషన్లో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
- టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 30.06.2026.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 29.07.2026.
ఈ అర్హతలు కలిగిన వారు జులై 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు రూ.19,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు. విద్యార్హతలు, రాత పరీక్ష సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, దరఖాస్తు ప్రక్రియ, రీజియన్ల వారీ ఖాళీలు, రాత పరీక్ష వంటి ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు జూన్ 30వ తేదీన విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.