October 26, 2025

హైలైట్ :

  • ఏపీలో ఆటో డ్రైవర్లకు రూ.15వేలు
  • ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్టేటస్
  • ఆధార్ నంబర్ ఆధారంగా చెక్ చేయొచ్చు

Auto Drivers Sevalo Scheme 2025 Beneficiaries List :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించనుంది. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్న డ్రైవర్ల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి రూ.15,000 ప్రకటించారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద అక్టోబర్ 2న 3.10 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. ప్రతి ఏటా ఈ సాయం అందుతుంది. అర్హులు తమ ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తోంది. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్నామంటూ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి రూ.15వేలు ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15,000 జమ చేయనున్నారు. ఈ పథకానికి “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరు పెట్టారు. ప్రతి ఏటా రూ.15వేలు చొప్పున అందజేయనున్నారు. ఈ పథకం కింద మొత్తం 3,10,385 మంది అర్హుల జాబితా సిద్ధం చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత అర్హుల జాబితా ఖరారు చేశారు. ఏపీ ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుంది. స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

 “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆటో డ్రైవర్‌ల కోసం ప్రారంభించబోతున్న పథకం జాబితాలో పేరు ఉందో లేదో స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ పథకం స్టేటస్ చెక్ చేయడానికి లాగిన్ అవసరం లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆధార్ కార్డ్ నంబర్‌తో చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్‌ను క్లిక్ చేసి పథకం స్టేటస్, లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఆ లింక్ ఇదే.
CLICK HERE — AUTO DRIVERS SEVALO.

ముందు NBM అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main. Home పేజీలో “Application Status / Public Navasakam Application Status” ఎంపిక చేసుకోవాలి. Scheme Dropdown లో “Financial Assistance to Auto and Maxi Cab Owners (Auto Driver Sevalo / Vahana Mitra)” ఎంపిక చేయాలి. 12 అంకెల ఆధార్ నంబర్ & క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేసి Submit / Check Status క్లిక్ చేస్తే చాలు. వెంటనే Application Status స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *