ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆర్టిసి బస్సుల్లో మహిళల సందడే కనిపిస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణలో ‘మహాలక్ష్మి’, ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకాల ద్వారా మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం మహిళలకేనా.. మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్న పురుషులకు ఇప్పుడు ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి.
పురుషులకు కూడా ఉచిత ప్రయాణం!
అందరికీ కాకపోయినా సమాజంలో ప్రత్యేక చేయూత అవసరమైన దివ్యాంగులకు (Disabled) ఇకపై ఆర్టిసి బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణం కల్పించాలని అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. దీనివల్ల వేలాది మంది దివ్యాంగులైన పురుషులకు భారీ ఊరట కలగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సిఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘ఇంద్రధనుస్సు’ పథకం కింద దివ్యాంగుల సంక్షేమం కోసం 7 ముఖ్యమైన వరాలను ప్రకటించిన సిఎం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ప్రత్యేక డిగ్రీ కాలేజీ, నియోజకవర్గానికి ఒక భవనం, ఇంటి స్థలాలు వంటి సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.
APSRTC దివ్యాంగుల ఉచిత ప్రయాణం – ముఖ్యాంశాలు:
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని “ఇంద్ర ధనస్సు” పేరుతో 2026-27 బడ్జెట్‌లో ప్రకటించారు, ఇది సుమారు 2 లక్షల మందికి పైగా దివ్యాంగులకు మేలు చేస్తుంది. ఇప్పటివరకు 50% రాయితీ పొందుతున్న దివ్యాంగులకు, ఇకపై ఉచిత ప్రయాణంతో పాటు, ప్రయాణంలో మరిన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.
ప్రధానాంశాలు :
- పథకం పేరు: ఇంద్ర ధనస్సు (బడ్జెట్ 2026-27).
- ఉచిత ప్రయాణం: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం.
- అమలు : ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న ప్రభుత్వం, దివ్యాంగులకూ దీనిని విస్తరించింది.
- ప్రయోజనం: దాదాపు 2 లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది.
- ముందున్న సౌకర్యం: ప్రస్తుతం వీరికి టికెట్ ధరలో 50% రాయితీ అందుబాటులో ఉంది.
ఈ నిర్ణయం వల్ల దివ్యాంగులకు రవాణా సౌకర్యం సులభతరం కానుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది.
తెలంగాణలోనూ దివ్యాంగులందరికీ ‘ఫ్రీ జర్నీ’…..
తెలంగాణలోనూ ‘ఫ్రీ జర్నీ’ దిశగా అడుగులు తెలంగాణ ప్రభుత్వం కూడా దివ్యాంగులకు ఊరటనిచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అధికారిక ప్రకటన వెలువరిస్తామని తెలిపారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో కూడా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వస్తుంది.