May 15, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి సర్కార్ తీపికబురు చెప్పింది. తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జూన్‌ 19వ తేదీన జమ చేయనుంది. విద్యార్ధుల తల్లిదండ్రులు బ్యాంకు అకౌంటు ఆధార్ తో లింక్ అయిందో లేదో చెక్‌ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆధార్‌ నంబర్‌తో బ్యాంకు NPCI మ్యాపర్‌లో లింక్‌ అయిందో లేదో ఈ కింది విధంగా సులువుగా చెక్ చేసుకోండి.

మీ బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించి, ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్‌ ద్వారా ఆధార్‌ నంబర్‌ను మీ అకౌంట్‌కు లింక్ చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి అక్కడి సిబ్బందిని సంప్రదించి నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఒకే ఒక బ్యాంకు ఖాతాను NPCI మ్యాపర్‌కు లింక్‌ చేయాలని అధికారులు తెలిపారు. ఒక వేళ మీరు మరొక బ్యాంకు అకౌంట్‌కు మార్చుకోవాలంటే కొత్త అకౌంట్‌లో NPCI లింకింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తే.. ఆటోమెటిక్‌గా పాత అకౌంట్‌ నుంచి కొత్త అకౌంట్‌కు ఓవర్‌రైడ్‌ అవుతుందని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)