September 11, 2026

రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన బీటా వెర్షన్ త్వరలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం రైల్వేశాఖ ప్రకటించింది. గత నెలలో జైపూర్‌లో మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT)ని సందర్శించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. విద్యార్థులతో జరిగిన సమావేశంలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ప్రారంభంపై స్పష్టతిచ్చారు. జూలైలో కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు శుక్రవారం IRCTC, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అధికారులు MNIT విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త IRCTC వెబ్‌సైట్ బీటా వెర్షన్‌ను ప్రదర్శించారు.

కొత్త IRCTC WEBSITE బీటా వెర్షన్‌ త్వరలో అధికారికంగా ప్రారంభించనుండగా.. విద్యార్థుల నుండి అభిప్రాయాన్ని తీసుకునేందుకు ప్రదర్శించారు. IRCTC కొత్త వెబ్‌సైట్ ప్రస్తుతం ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ఇంజన్‌తో అనుసంధానించనున్నారు. ప్రస్తుతం ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో పనిచేసే కొత్త IRCTC పోర్టల్ కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. కొత్త పోర్టల్‌లో అనేక మార్పులు చేశారు. ఎలాంటి టెక్నికల్ సమస్యలు, సర్వర్ డౌన్ సమస్యలు లాంటివి లేకుండా వేగంగా టికెట్లను బుక్ చేసుకునేలా సిస్టమ్ అప్‌గ్రేడ్ చేశారు. తాత్కా్ల్ టికెట్ల సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఆధునీకరించారు. తత్కాల్ టికెట్ల సమయంలో ఒకేసారి అందరూ వెబ్ సైట్ ఓపెన్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఆ సమస్యను తొలగించారు.

కొత్త IRCTC వెబ్‌సైట్‌లో ప్రధానంగా నాలుగు మార్పులు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. సులభంగా వినియోగదారులు పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు క్యాప్చాలు, పాప్-అప్‌లు, మెరిసే గ్రాఫిక్స్, ఇతర అంశాలను తొలగించింది. అన్ని క్లాసుల్లోనూ సీట్ల లభ్యత చూసేలా మార్పులు చేశారు. ఇక టిక్కెట్ బుకింగ్‌ను పూర్తి చేయడానికి అవసరమైన దశల సంఖ్యను కూడా తగ్గించారు. దీని ద్వారా ప్రయాణికులకు వేగవంతంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రయాణీకులు ముందే తమ వివరాలు సేవ్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చారు. దీని వల్ల రిజర్వేషన్ సమయంలో ఇబ్బంది ఉండదు. దేశంలో దాదాపు 88 శాతం టికెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ అవుతున్నాయి. దీంతో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ 40 ఏళ్ల నాటి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో డిమాండ్‌కు తగ్గట్లు కొత్త రిజర్వేషన్ సిస్టమ్‌లో మార్పులు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)