EPFO Big Alert :
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పీఎఫ్ పోర్టల్‌లో ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం, ప్రొఫైల్ ఫోటోను అప్‌లోడ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చేయకపోతే పీఎఫ్ క్లెయిమ్స్, పెన్షన్, జీవిత బీమా సౌకర్యం పొందటంలో అవాంతరాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రొఫైల్ ఫోటోను ఆన్‌లైన్ వెరిఫికేషన్ సమయంలో ఉపయోగిస్తారు. ప్రొఫైల్ ఫోటోను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కానప్పటికీ.. ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా వేగవంతంగా సేవలు పొందవచ్చు. ఫొటో, ఇ-నామినేషన్‌ను పూర్తి చేయనివారు ఆన్‌లైన్ EPFO సేవలను పొందటంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.

EPF సభ్యులు ఫొటో, నామినీ డీటైల్స్ అప్ లోడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ :
EPF ఖాతాదారుడు అదనంగా సరైన వ్యక్తిగత సమాచారంతో (ప్రొఫైల్ ఫోటోతో సహా) ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం ద్వారా సభ్యులు ఎలాంటి అంతరాయం లేకుండా వివిధ ఆన్‌లైన్ EPFO సేవలను పొందవచ్చు. ఖాతాదారుడు నామినీని ఎంచుకోకపోతే వారి కుటుంబ సభ్యులు డబ్బును క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు. అలాగే మరిన్ని పత్రాలు అవసరం కావచ్చు. EPF ఇ-నామినేషన్‌ను చెల్లుబాటు అయ్యేలా చేయడానికి, సభ్యులు తప్పనిసరిగా ఇ-సైన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి. సరైన నామినేషన్, జమ చేయబడిన EPF బ్యాలెన్స్‌తో పాటు, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కింద లభించే ప్రయోజనాలు కూడా అర్హులైన లబ్ధిదారునికి సజావుగా బదిలీ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇక పొటో, ఈ నామినేషన్‌నే కాకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటైల్స్ అప్డేట్ చేయడం కూడా ముఖ్యం. పీఎఫ్ క్లెయిమ్స్ ఎలాంటి సమస్యలు లేకుండా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. అన్నీ వివరాలు అప్డేట్ చేయడం వల్ల EPFO సేవల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడదు.