
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) :
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు బీమా, సబ్సిడీ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. అయితే చాలామందికి వీటి గురించి అవగాహన లేదు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం (PMFBY ) :
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు నష్టం జరినప్పుడు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా పరిహారం అందిస్తుంది. వర్షాలు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు కేంద్రం ఆర్ధిక సాయం అందిస్తోంది. 2016లో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు చాలామందికి రైతులు దీని వల్ల ప్రయోజనం పొందారు. ఈ స్కీమ్ ద్వారా రైతులు కొంత మొత్తం ప్రీమియం చెల్లిస్తే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా ప్రీమియంను భరిస్తాయి.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) :
ప్రారంభం : 2016
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) ‘ప్రాంతీయ విధాన ప్రాతిపదికన’, విత్తనానికి ముందు నుండి పంట కోత అనంతర దశ వరకు నివారించలేని అన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి రైతుల పంటలకు సమగ్ర నష్ట నివారణ కవరేజీని అందించేందుకు, సరసమైన పంటల బీమాను అందించడం ద్వారా వ్యవసాయంలో ఉత్పత్తికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.
భాగస్వాములు :
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, సీఎస్‌సీలు, భీమా కంపెనీలు, రైతులు
నమోదు :
స్వచ్ఛందం (ఖరీఫ్ 2020 సీజన్ తర్వాత)
బీమా వేటికి వరిస్తుంది :
వరదలు, తుఫాన్లు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు, సహజ విపత్తుల వల్ల జరిగే నష్టాలకు వర్తిస్తుంది. ఇక పంట కోసాక పొలంలో ఆరబెట్టినప్పుడు 14 రోజలు వరకు జరిగే నష్టాలకు కూడా వర్తిస్తుంది. నష్టాన్ని అంచనా వేశాక కేవలం 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారు. రైతులు రూ.76 ప్రీమియం చెల్లిస్తే రూ.38 వేల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ పథకం అమల్లో ఉంది. దీంతో రైతులు స్వచ్చంధంగా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. రైతులు ఈ పథకంలో చేరి లబ్ది పొందాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నారు. పంట నష్టపోయినప్పుడు మీకు పరిహారం అందుతుంది. దీని వల్ల మీ నష్టం కొంతవరకు తగ్గుతుంది. దీంతో రైతులకు ఎంతో ఉపయోగపడే పథకంగా దీనిని చెప్పవచ్చు.
పథకం యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు :
సహజ విపరీతాలు : వరదలు, కరవు, తుఫానులు, వడగళ్ల వానలు, అగ్నిప్రమాదాలు మరియు తెగుళ్ల వల్ల పంట నష్టపోయినప్పుడు సహాయం అందుతుంది.
సమగ్ర రక్షణ : విత్తనాలు వేయడానికి ముందు నుండి, పంట కోత వరకు మరియు కోత తర్వాత జరిగే నష్టాలకు కూడా బీమా వర్తిస్తుంది.
అర్హతలు మరియు ప్రీమియం :
- అర్హత : కౌలు రైతులు మరియు భూమి ఉన్న రైతులు అందరూ ఈ పథకంలో చేరవచ్చు. అన్నీ రకాల ఆహార, నూనెగింజలు, మరియు వార్షిక వాణిజ్య/ఉద్యానవన పంటలు కవర్ చేయబడతాయి.
ప్రీమియం వివరాలు :
- ఖరీఫ్ (వర్షాకాలం) పంటలకు : గరిష్టంగా 2%
- రబీ (శీతాకాలం) పంటలకు : గరిష్టంగా 1.5%
- వాణిజ్య/ఉద్యాన పంటలకు : గరిష్టంగా 5% ప్రీమియంను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
దరఖాస్తు మరియు సంప్రదింపు వివరాలు :
- దరఖాస్తు విధానం : సమీపంలోని మీ సేవ కేంద్రం, అధీకృత బ్యాంకులు లేదా వ్యవసాయ అధికారుల ద్వారా పంట బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్ స్టేటస్ : మీ అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి PMFBY పోర్టల్‌లో పాలసీ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు.
- హెల్ప్‌లైన్ నంబర్ : ఏదైనా సమాచారం కోసం 14447 నంబర్‌కు లేదా వాట్సాప్ నంబర్ 7065514447 ద్వారా సహాయం పొందవచ్చు.
వ్యవసాయ అధికారులు విడుదల చేసే తాజా గడువులు మరియు మార్గదర్శకాలను గమనిస్తూ ఉండడం ద్వారా సమయానికి ప్రీమియం చెల్లించి పంట బీమాను పొందవచ్చు