June 12, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పథకం పేరు ” విదేశీ విద్య పథకం”. ఈ పథకం ద్వారా విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థులకు రూ.25 లక్షల సాయం అందించనుంది. అన్ని వర్గాల్లోని పేద విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేయనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలుకు సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశీ విద్యా పథకాన్ని త్వరలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ Scheme అమలు కోసం త్వరలోనే విధివిధానాలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. BPL పరిధిలోని అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ విడదుల చేస్తామన్నారు. ఎస్సీ విద్యార్థులకే కాకుండా అన్ని వర్గాల్లోని పేద విద్యార్థులకు లబ్ది జరిగేలా ఈ పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

పథకం పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ వంటి కోర్సులను విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థులకు సాయం అందిస్తారు. గతంలో ఎన్టీఆర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేర్లతో ఈ పథకాన్ని టీడీపీ అమలు చేయగా.. వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పేరుతో అమలు చేస్తారు. ఇందులో భాగంగా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో టాప్-50 వర్సిటీల్లో సబ్జెక్టుల వారీగా అడ్మిషన్లు పొందినవారికి వర్తింపచేశారు. కానీ ఇప్పుడు టాప్ -250 వర్సిటీల్లో అడ్మిషన్లు పొందినవారికి సాయం అందించనున్నారు. ఈ మేరకు పథకంలో కూటమి ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. త్వలరలో విడుదల చేయనున్న విధివిధానాల్లో పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు కూాాడా విదేశీ విద్య అభ్యసించనున్నారు. విదేశాల్లో చదువుకోవాలంటే కేవలం ధనవంతులే కాదు.. పేదలు కూాడా ఈ పథకం ద్వారా చదువుకోవచ్చు.

విదేశాల్లో చదువుకోవాలనునే విద్యార్ధుల కోసం ఈ పథకం అమలు చేస్తున్నారు. విదేశీ విద్య ఖర్చుతో కూడుకున్నది. రూ.లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ వర్గాల్లోని పేద విద్యార్థులకు సాయం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించనుండగా బీసీ, మైనార్టీలకు రూ.20 లక్షలు ఇస్తారు. ఇక కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.15 లక్షలు అందించనున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా మరో రూ.5 లక్షలు అందించాలన ప్రభుత్వం చూస్తోంది. నిర్వహణ ఖర్చుల కోసం వీటిని అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)