June 2, 2026

ఏపీలో కొత్త విద్యా సంవత్సరం పిల్లల చదువుల కోసం ఎదురుచూస్తోన్న తల్లులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారుల కోసం ఒక కీలకమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయా లేదా? మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి? అనే వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు.

ఏపీలోని విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలకమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కోసం అర్హత పొందిన తల్లులు తమ దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో సులభంగా పరిశీలించుకునే అవకాశం కల్పించింది. ఆధార్ నంబర్ ఆ సహాయంతోనే వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పథకానికి సంబంధించిన అర్హుల గుర్తింపు, వివరాల పరిశీలన, ధృవీకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలల ద్వారా విద్యార్థుల వివరాలను సేకరించి తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నా, అర్హత ప్రమాణాలు నెరవేర్చిన ప్రతి విద్యార్థికి పథకం వర్తిస్తుంది. దీంతో గత పథకాలతో పోలిస్తే ఎక్కువ కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)