EPFO 3.0 మారిన పీఎఫ్ విత్ డ్రా రూల్స్ :
EPFO పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చింది. పీఎఫ్ పాక్షిత విత్ డ్రా రూల్స్‌ను మార్చింది. ఈ మేరకు విత్ డ్రాలకు పరిమితులు విధించింది. ఇక నుంచి కనీసం 25 % బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఏదాది రెండుసార్లు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశముంటుంది.విత్ డ్రా రూల్స్ పూర్తి వివరాలు కోసం చివరి వరకు చూడండి.

ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త పథకం :
కేంద్ర ప్రభుత్వం EPF పథకంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న విత్ డ్రా, పెన్షన్ నిబంధనలను మార్చింది. ఉద్యోగం చేస్తున్నప్పుడే పీఎఫ్ బ్యాలెన్స్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలను సవరించింది. గతంలో ఉన్న ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఈపీఎఫ్ 2026 పథకం తీసుకొచ్చింది. జూన్ 29వ తేదీ నుంచి దీనిని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
పాక్షిక ఉససంహరణ రూల్స్ లో మార్పులు చేసారు :
EPFO కొత్త పథకం ప్రకారం పీఎఫ్ కాంట్రిబ్యూషన్, పాక్షిక ఉససంహరణ రూల్స్ మారాయి. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు పలు కారణాలతో పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. అయితే పీఎఫ్ బ్యాలెన్స్‌లో కనీసం 25 % నిధులు తప్పనిసరిగా ఉంచాలి. మిగిలిన నిధిలో 50% నుంచి 75 % వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుంది. కొత్త పథకం ప్రకారం పీఎఫ్ ఖాతా నుండి పాక్షిక నిధులను ఉపసంహరించుకోవడానికి అనేక షరతులు విధించారు.
- వైద్య చికిత్స కోసం 12 నెలల సర్వీస్ తర్వాత అర్హత గల బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు స్వంతంగా లేదా కుటుంబ సభ్యుల కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుది.
- విద్య కోసం సర్వీస్ కాలంలో 10 సార్లు ఉపసంహరించుకోవచ్చు.
- వివాహ ఖర్చుల కోసం 5 సార్లు వరకు అనుమతి ఉంటుంది.
- గృహ కొనుగోలు, నిర్మాణం, మరమ్మతులు, లోన్ చెల్లింపు కోసం అర్హత గల బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు తీసుకోవచ్చు.
- ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు తీసుకోవచ్చు. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రెండుసార్లు ఈ అవకాశం ఉంటుంది.
ఈ మేరకు పాక్షిక విత్ డ్రాలపై కేంద్రం కఠిన ఆంక్షల విధించింది. ఉద్యోగులకు దీర్ఘకాలంలో ఆర్ధిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు తీసుకొచ్చింది