EPFO NEW UPDATE 2026 :
EPFO – BEAM APP లో మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి రానుంది. నేరుగా ఎన్‌పీఎస్ అకౌంట్ తెరవొచ్చు. అలాగే పీఎఫ్ పెన్షన్ నిధులను ఎన్‌పీఎస్ ఖాతాకు బదిలీ చేయవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త వ్యవస్థను అభివృద్ది చేస్తోంది.పూర్తి వివరాలు చూద్దాం.

NPS – నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ తెరిచేందుకు ఇక నుంచి ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. ఇక నుంచి ఆన్‌లైన్ ఫారమ్‌లు నింపాల్సిన అవసరం లేదు. ఇక PFపెన్షన్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే యూఏఎన్ వెబ్ సైట్ తెరవాల్సిన పని లేదు. నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో నడుస్తున్న బీమ్ యాప్ ద్వారా మీరు ఈ పనులన్నీ సులువుగా చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సంయుక్తంగా అధునాతన వ్యవస్థను అమలు చేస్తున్నాయి. త్వరలోనే ఈ కొత్త వ్యవస్థను ప్రారంభించనున్నాయి. దీని ద్వారా బీమ్ యాప్‌ను ఉపయోగించి నిమిషాల్లోనే NPS అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కింద అందే పెన్షన్ (EPS) నిధులను నేరుగా NPS ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా PF డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.
డిజిటల్ అవగాహన లేకపోయినా అవసరమైన మొత్తంలో పెట్టుబడులు పెట్టవచ్చు :
ఈ ఫీచర్ వల్ల డిజిటల్ అవగాహన లేనివారు కూడా సులువుగా అకౌంట్ తెరిచి నిధులు పెట్టుబడి పెట్టవచ్చు. భీమ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నమ్మకమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా పేరు పొందింది. ఈ సౌకర్యం కల్పించడం వల్ల గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల ప్రజలకు కూడా అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో చిన్న మొత్తాలను పొదుపు చేసుకోవచ్చు. వృద్ధాప్యం కోసం తమకు అవసరమైన మొత్తంలో పెట్టుబడులు పెట్టవచ్చు.
పీఎఫ్ అకౌంట్లో ఉండే పింఛను నిధులను నేరుగా NPS కు బదిలీ :
ఈ కొత్త వ్యవస్థ వలన NPS అకౌంట్ తెరిచే ప్రక్రియను పూర్తిగా పేపర్‌లెస్‌గా మార్చనుంది. ఏదైనా అకౌంట్ తెరవాలంటే KYC ప్రక్రియ అవసరమవుతుంది. BEAM APP ద్వారా NPS అకౌంట్ తెరవాలంటే.. మీరు అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. మీ బ్యాంక్ అకౌంట్‌తో అనుబంధించబడిన ఇప్పటికే ఉన్న KYC సమాచారాన్ని ఉపయోగిస్తుంది. దీంతో కేవలం కొన్ని క్లిక్‌లతో తమ పెన్షన్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు. డిజిటల్ పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారు కూడా సింపుల్‌గా అకౌంట్ తెరవొచ్చు. ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం (EPS), జాతీయ పింఛను వ్యవస్థ (NPS) రెండు వేర్వేరు వేదికలుగా పనిచేస్తున్నాయి. ఈ రెండు వ్యవస్థల మధ్య నిధులను సులువుగా బదిలీ చేసుకునేందుకు ఒక చట్టపరమైన ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. అవసరమైన చట్టపరమైన సవరణలకు ఆమోదం లభిస్తే.. ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్లో ఉండే పింఛను నిధులను నేరుగా NPSకు బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం వీటి మధ్య ప్రత్యక్షంగా నిధులను బదిలీ చేసుకునే సౌకర్యం లేదు. త్వరలోనే బదిలీ చేసుకునే సదుపాయం ప్రవేశపెట్టనున్నారు.