May 12, 2026

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని ఉచితంగా అప్‌డేట్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.సాధారణంగా 5 ఏళ్లు మరియు 15 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడం నిబంధనల ప్రకారం తప్పనిసరి. విద్యార్థులు పైచదువులకు వెళ్లాలన్నా, పోటీ పరీక్షలకు హాజరుకావాలన్నా లేదా ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియలోనైనా బయోమెట్రిక్ అప్‌డేట్‌గా లేకపోతే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రత్యేక అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ శిబిరాల ద్వారా విద్యార్థులు ఎటువంటి రుసుము చెల్లించకుండా తమ ఆధార్ వివరాలను సరిచేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.99 లక్షల మంది విద్యార్థులు తమ బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్రలు, ఐరిస్) అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని UIDAI గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మే 12 నుంచి 15 వరకు మరియు మే 19 నుంచి 22 వరకు రెండు విడతల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)