TOP E-SCOOTERS IN INDIA :
ఓలా ఏక్కడ ఉంది :
విద్యుత్ స్కూటర్ల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన కంపెనీలు దూసుకెళుతున్నాయి. ఫిబ్రవరిలోనూ టీవీఎస్, బజాజ్ సత్తా చాటాయి. అత్యధిక వాహన విక్రయాలతో దూసుకెళుతున్నాయి. మరోవైపు ఒకప్పుడు ఈవీ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థ మార్కెట్ వాటా భారీగా పతనమైంది. టాప్-5లోనూ చోటు దక్కించుకోలేకపోయింది. గ్రీవ్స్ కాటన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ తొలిసారిగా టాప్-5లో చోటు సాధించింది. ఇక ఫిబ్రవరిలో మొత్తం 1,11,680 యూనిట్ల విద్యుత్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే 46% వృద్ధి నమోదైంది.

టీవీఎస్ మోటర్స్ అదుర్స్ :
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్స్ ఫిబ్రవరిలో 31,600 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 67% వృద్ధి నమోదు చేసింది. మరో ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 25,323 యూనిట్ల విక్రయాలతో ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. ఈ సంస్థ విక్రయిస్తున్న చేతక్ విక్రయాల్లో గతేడాదితో పోలిస్తే 17% వృద్ధి నమోదైంది.
మూడో స్థానం ఎవరిదీ :
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఈ జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమించింది. గతేడాదితో పోలిస్తే 72% వృద్ధి నమోదు చేసి 20,581 యూనిట్లను విక్రయించింది. విడా బ్రాండ్‌పై విద్యుత్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న హీరో మోటోకార్ప్ ఫిబ్రవరిలో 12,512 యూనిట్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 364% రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది.
తొలిసారి టాప్-5 కి :
ఇక ఈ జాబితాలో గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంచనాలను మించి వృద్ధి సాధించింది. ఓలా కంపెనీని వెనక్కి నెట్టి తొలిసారి టాప్-5కి ఎగబాకింది. గతేడాదితో పోలిస్తే 27% వృద్ధితో 4,725 యూనిట్లను విక్రయించింది. యాంపియర్ పేరిట ఈ సంస్థ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది.
TOP 5 E-SCOOTERS IN INDIA – Quick Comparison Table
| Scooter Model | Range (km) | Top Speed | Best For |
| Ola S1 Pro | 242 km | 117 kmph | Tech & Performance |
| TVS iQube ST | 212 km | 82 kmph | Comfort & Reliability |
| Ather 450X | 161 km | 90 kmph | Speed & Handling |
| Bajaj Chetak | 155 km | 73 kmph | Build Quality |
| Ather Rizta | 159 km | 80 kmph | Family & Storage |