January 29, 2026

EPFO : ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గురించి అవగాహన ఉంటుంది. అయితే కొందరికి పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కథనంలో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?, దానికున్న మార్గాలు ఏమిటనేది వివరంగా తెలుసుకుందాం.


యూఏఎన్ పోర్టల్‌లో ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFOలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు.

  • మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలనుకునే సభ్యులు ముందుగా.. మొబైల్ నెంబర్‌ను యూనిఫైడ్ పోర్టల్‌లో UANతో యాక్టివేట్ చేయాలి. దీనికోసం కావలసిన డాక్యుమెంట్లతో కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి.
  • 9966044425 కు కాల్ చేసినప్పుడు రెండు రింగ్‌ల తర్వాత స్వయంచాలకంగా డిస్‌కనెక్ట్ అవుతుంది. తరువాత ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అందులోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు.


యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవచ్చు.

  • EPFOHO UAN టెక్స్ట్‌లో మీ UAN నంబర్‌ను యాడ్ చేసి.. మీ ప్రాంతీయ భాషలో ప్రతిస్పందనను స్వీకరించాలనుకుంటే, టెక్స్ట్‌లో మీ UAN తర్వాత మీకు నచ్చిన భాష కోసం కోడ్‌ను వెల్లడించాలి. ఇది ఇంగ్లీష్, హిందీ (HIN), పంజాబీ (PUN), గుజరాతీ (GUJ), మరాఠీ (MAR), కన్నడ (KAN), తెలుగు (TEL), తమిళం (TAM), మలయాళం (MAL), బెంగాలీ (BEN) వంటి పది భాషల్లో అందుబాటులో ఉంటుంది.
  • ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. సర్వీసెస్ ఫర్ ఎంప్లాయీస్‌పై క్లిక్ చేసి, దీని కింద ఉన్న మెంబర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి.
  • EPFO ​​పోర్టల్‌లో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) & పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • ఇలా లాగిన్ అయిన తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవచ్చు.
  • UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలంటే.. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత.. లాగిన్ అయి EPFO ​​సేవలను యాక్సెస్ చేయడానికి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని లింక్ చేయాలి.
  • లింక్ చేసిన తర్వాత, మీరు UMANG యాప్ ద్వారా మీ PF బ్యాలెన్స్‌ను సులభంగా చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)