March 13, 2026

EPFకి నెలకు కేవలం రూ.5,000 కాంట్రిబ్యూట్‌ చేస్తూ.. 10% యాన్యువల్‌ శాలరీ ఇంక్రిమెంట్‌తో, దాదాపు రూ.3.5 కోట్ల రిటైర్‌మెంట్‌ కార్పస్‌ క్రియేట్‌ చేయవచ్చు. అదెలాగో చూద్దాం.

ఇండియాలో ప్రతి ఉద్యోగికి ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్‌ తప్పనిసరి. రూ.15 వేలకు పైగా బేసిక్‌ శాలరీ అందుకుంటున్న ప్రతి ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం ఈపీఎఫ్‌ అకౌంట్‌కి వెళ్తుంది. ఇది చాలా చిన్న అమౌంట్‌గా అనిపించవచ్చు, కానీ లాంగ్‌ టర్మ్‌లో భారీ రిటైర్‌మెంట్‌ ఫండ్‌ క్రియేట్‌ చేస్తుంది. ఉదాహరణకు EPFకి నెలకు కేవలం రూ.5,000 కాంట్రిబ్యూట్‌ చేస్తూ.. 10% యాన్యువల్‌ శాలరీ ఇంక్రిమెంట్‌తో, దాదాపు రూ.3.5 కోట్ల రిటైర్‌మెంట్‌ కార్పస్‌ క్రియేట్‌ చేయవచ్చు. అదెలాగో చూద్దాం. 

EPF గురించి..ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మేనేజ్‌ చేసే రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. ఇది ఉద్యోగులకు పెన్షన్, ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలను అందించడంతో పాటు రిటైర్‌మెంట్‌ కోసం కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తుంది. మీరు, మీ కంపెనీ ఇద్దరూ ఈ ఫండ్‌కి కాంట్రిబ్యూట్‌ చేస్తారు. 

ప్రతి నెలా, మీ బేసిక్‌ శాలరీలో 12% డిడక్ట్‌ చేసి, మీ EPF అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తారు. మీ కంపెనీ కూడా మీ బేసిక్‌ శాలరీలో 3.67% మీ EPFకి కాంట్రిబ్యూట్‌ చేస్తుంది. కంపెనీ కాంట్రిబ్యూషన్‌లో 8.33% ఎంప్లాయీస్‌ పెన్షన్ స్కీమ్‌ (EPS)గా పేర్కొనే పెన్షన్ స్కీమ్‌కి వెళుతుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం మీ EPF బ్యాలెన్స్‌కు వడ్డీ కలుపుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు 8.25%గా ఉంది. ఉదాహరణకు, మీ జీతం రూ.64,000 అయితే, మీ బేసక్‌ శాలరీ దాదాపు రూ.31,900 కావచ్చు. కాంట్రిబ్యూషన్స్‌ ఎలా ఉంటాయంటే.. 

మీ కాంట్రిబ్యూషన్‌: రూ. 31,900 లో 12% = రూ.3,828కంపెనీ EPF కాంట్రిబ్యూషన్‌: రూ.31,900 లో 3.67% = రూ.1,172నెలకు మొత్తం EPF కాంట్రిబ్యూషన్‌: రూ.3,828 + రూ.1,172 = రూ. 5,000

రూ.5,000తో రూ.3.5 కోట్ల కార్పస్మీరు 25 సంవత్సరాల వయస్సులో పని చేయడం ప్రారంభించారు అనుకుందాం. 33 సంవత్సరాలు (58 సంవత్సరాల వయస్సు వరకు) EPFకి కాంట్రిబ్యూట్‌ చేయాలి. అప్పుడు.. మీ మంత్లీ EPF కాంట్రిబ్యూషన్‌ రూ.5,000 నుంచి ప్రారంభమవుతుంది. మీ జీతం ప్రతి సంవత్సరం 10% పెరిగితే, మీ EPF కాంట్రిబ్యూషన్‌ కూడా కాలక్రమేణా పెరుగుతుంది. మీ EPF బ్యాలెన్స్‌పై 8.25% వడ్డీ పెరుగుతూనే ఉంటుంది, మీ సేవింగ్స్‌ని కాంపౌండ్‌ చేస్తుంది.

33 సంవత్సరాలలో, EPFకి మీ మొత్తం కాంట్రిబ్యూషన్‌ దాదాపు రూ.1.33 కోట్లు అవుతుంది. వడ్డీ, గ్రోత్‌తో మీరు పదవీ విరమణ చేసే సమయానికి మీ EPF ఫండ్‌ సుమారు రూ.3.5 కోట్లకు పెరగవచ్చు. ఈ స్థాయి రిటర్న్స్‌ కాంపౌండింగ్ పవర్‌తో సాధ్యమవుతుంది. మీ డబ్బు వడ్డీని సంపాదిస్తుంది, ఆ వడ్డీ కాలక్రమేణా ఎక్కువ వడ్డీని సంపాదిస్తుంది.

EPF ఎందుకు బెస్ట్‌ ఆప్షన్‌?భారీ రిటైర్‌మెంట్‌ ఫండ్‌తోపాటు మీకు రిటైర్‌మెంట్‌ తర్వాత మంత్లీ పెన్షన్‌ లభిస్తుంది. EPF లింక్డ్ స్కీమ్స్ ద్వారా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ కూడా ఉంటాయి. అలానే EPFకి కంపెనీ చేసే కాంట్రిబ్యూషన్‌లపై సెక్షన్ 80C కింద ట్యాక్స్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. అయితే ఈ ఆప్షన్ పాత పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో అందరికీ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)