October 2, 2026

ఆధార్ కార్డుకు సంబంధించి 5 కీలక మార్పులు అమల్లోకి వచ్చేశాయి. UIDAI కొత్త WEBSITE తో పాటు ఆధార్ సేవలు సులభతరంగా పొందేందుకు UIDIA కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. రేషన్ షాపుల్లో ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థలో కూాడా మార్పుల చేసింది.ఈ 5 మార్పులు తప్పక తెలుసుకోండి!

కేంద్ర ప్రభుత్వం ఆధార్ సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు ఈ కొత్త ఫీచర్లు ఉపయోగపడనున్నాయి. ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఇకపై తొలగిపోనున్నాయి. వినియోగదారులకు సేవలను మరింత సులువు చేసేందుకు ఆధార్ దినోత్సవం సందర్భంగా ఈ కొత్త అప్డేట్స్ యూఐడీఏఐ తీసుకొచ్చింది. రేషన్ షాపుల్లో ఆధార్ ఫేస్ రికగ్నినేషన్ సిస్టమ్, యూఐడీఏఐ కార్యాలయాల్లో టోకెన్ సిస్టమ్, తక్కువ ప్రమాణీకరణ కలిగిన సంస్థల కోసం ఫ్రేమ్ వర్క్, ప్రభుత్వేతర సంస్థల కోసం కొత్త పోర్టల్, యూఐడీఏఐ వెబ్ సైట్లో మార్పులు వంటివి ఈ ఫీచర్లలో ఉన్నాయి.

UIDAI ప్రస్తుతం ఉన్న వెబ్ సైట్లో మార్పులు చేసింది. స్క్రీన్ రీడర్ సపోర్ట్, కీబోర్డ్ నావిగేషన్, మెరుగైన ఫాంట్ కాంట్రాస్ట్ వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 13 భాషల్లో వెబ్ సైట్ సేవలు అందుబాటులో ఉండగా.. దీనిని 23 భాషలకు విస్తరించాలని చూస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కార్యాలయాల్లో టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీని వల్ల వినియోగదారులు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. తమ వంతు వచ్చినప్పుడు ఆధార్ సేవలు పొందవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రజలు వచ్చినప్పుడు రద్దీని నియంత్రించడానికి ఇది సహాయపడనుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రేషన్ షాపుల్లో ఆధార్ ఫింగర్ ప్రింట్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. రేషన్ తీసుకోవాలంటే ఆధార్ ఫింగర్ ప్రింట్ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ సరిపోలకపోవడం వల్ల లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థలో ఫేస్ వెరిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీని వల్ల ముఖ ఆధారిత ధృవీకరణను పూర్తి చేసి రేషన్ పొందవచ్చు.

తక్కువ ప్రమాణీకరణ కలిగిన సంస్థల కోసం AUA మరియు KUA ఫ్రేమ్‌వర్క్‌ తీసుకొచ్చారు. ఆ సంస్థలకు ప్రత్యేక వ్యవస్థ అవసరం లేకుండా ప్రస్తుత ప్రమాణీకరణ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. ఆధార్ ప్రమాణీకరణ వ్యవస్థలోకి అనుసంధానం అయ్యే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడనుంది.

ప్రభుత్వేతర సంస్థలు ఆధార్ ధృవీకరణ ఆమోదం పొందేందుకు SWIK పోర్టల్ 2.0 తీసుకొచ్చారు. దీని వల్ల ఆన్‌లైన్‌లోనే ఆధార్ ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే పోర్టల్ ద్వారా సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)