EPFO WhatsApp Channel :
EPFO WhatsApp సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం WhatsApp Channel ప్రారంభించింది. ఇందులో సమాచారం మొత్తం ఒకేచోట తెలుసుకోవచ్చు. WhatsApp Channel ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.

EPFO కీలక నిర్ణయం :
EPFO తమ ఖాతాదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈపీఎఫ్ఓ పేరుతో ఒక వాట్సప్ ఛానెల్‌ను ప్రారంభించింది. PFకు సంబంధించి సమాచారం మొత్తం దీని ద్వారా ఒకేచోట తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ ఒకేచోట లభిస్తాయి. ఈపీఎఫ్ఓ తీసుకునే కొత్త నిర్ణయాలు, క్లెయిమ్ ప్రాసెస్, వడ్డీ జమ, పెన్షన్, బీమా సౌకర్యానికి సంబంధించిన అన్ని విషయాలు ఒకేచోట తెలుసుకోవచ్చు. ఇందుకోసం వివిధ ఫ్లాట్‌ఫామ్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఖాతాదారులకు తగ్గుతుంది. ప్రస్తుతం ప్రతీఒక్కరి ఫోన్లలో వాట్సప్ అనేది ఉంటుంది. ఈ షార్ట్ మెస్సేజింగ్ యాప్ ద్వారా ఏ సమాచారం అయినా క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. దీంతో చందాదారులకు వేగవంతంగా సమాచారం అందించేందుకు ఈపీఎఫ్ఓ కూడా అధికారికంగా వాట్సప్ ఛానెల్ అందుబాటులోకి తెచ్చింది.
ఈ లింక్ ద్వారా చేరవచ్చు..
EPFO ఒక లింక్ పొందుపర్చింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా వాట్సప్ ఛానెల్లో చేరవచ్చు.
CLICK HERE – EPFO WhatsApp Channel
EPFO WhatsApp Channel ద్వారా ఏయే సమాచారం పొందవచ్చు..?
EPFO తీసుకునే నిర్ణయాలు, నిబంధనల్లో మార్పులు,PF క్లెయిమ్స్, e – నామినేషన్ దాఖలు,UAN Activation కు సంబంధించిన సమాచారం పొందవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ప్రాసెస్ ఎలా అనేది వివరిస్తారు. వీటిని చూడటం ద్వారా మీరే స్వయంగా క్లెయిమ్స్ దాఖలు, యూఏఎన్ యాక్టివేషన్ లాంటివి చేసుకోవచ్చు. ఇక సైబర్ మోసాల బారిన పడకుండా సలహాలు, అలర్ట్స్ కూడా వాట్సప్ ఛానెల్ ద్వారా పొందవచ్చు.