LPG Gas Portability 2026 :
మీరు ప్రస్తుతం వాడుతున్న ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సర్వీస్ నచ్చకపోయినా, లేదా ఏదైనా సమస్య ఎదురైనా ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ ద్వారా ఉచితంగా మీ గ్యాస్ ఏజెన్సీని మార్చుకోవచ్చు. దీనిని ‘డిస్ట్రిబ్యూటర్ పోర్టబిలిటీ’ (Distributor Portability) అంటారు. దీనిని ఎవరెవరు మార్చుకోవచ్చో తెలుసా..? ఇండేన్ (Indane), భారత్ గ్యాస్ (Bharat Gas), హెచ్‌పీ గ్యాస్ (HP Gas) వినియోగదారులు ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

మార్చుకునే విధానం :
ముందుగా మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ను ఓపెన్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, కస్టమర్ ఐడీ (Customer ID) ఉపయోగించి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మెనూలో మీకు కనిపిస్తున్న ‘Distributor Portability’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు మీ ఇంటికి సమీపంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీల/డిస్ట్రిబ్యూటర్ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి, మీకు నచ్చిన కొత్త డిస్ట్రిబ్యూటర్ను ఎంచుకోండి. అలాగే కొత్త డిస్ట్రిబ్యూటర్ను ఎంచుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక OTP (One-Time Password) వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
మీ పోర్టబిలిటీ అభ్యర్థన విజయవంతంగా నమోదవుతుంది. ఇక తదుపరి ప్రక్రియ విషయానికొస్తే.. మీరు అభ్యర్థనను సమర్పించిన కొన్ని రోజుల్లోనే మీ గ్యాస్ కనెక్షన్ కొత్త డిస్ట్రిబ్యూటర్‌కు మారిపోతుంది. ఈ ప్రక్రియలో మీ కస్టమర్ నంబర్ కానీ, మీకు వచ్చే గ్యాస్ సబ్సిడీ (Subsidy) కానీ ఎలాంటి మార్పుకు లోనవ్వవు. అవి అలాగే ఉంటాయి.