July 4, 2026

ఈపీఎఫ్ఓ కీలక నిర్ఱయం తీసుకుంది. ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారులు వేగంగా క్లెయిమ్స్ పొందవచ్చు .కేవలం 72 గంటల్లోనే డబ్బులు పొందవచ్చు. అర్హులైనవారికి ఈ ప్రయోజనం కల్పిస్తారు. రూ.5లక్షల్లోపు క్లెయిమ్స్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతాయి.పూర్తి వివరాలు మీ కోసం ఈ వీడియో లో తెలియజేస్తాను.

EPFO 3.0 కొత్త విధానం ద్వారా అర్హులైన పీఎఫ్ ఖాతాదారులు మూడు రోజుల్లోగా క్లెయిమ్స్ పొందవచ్చు. క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకోగానే.. 72 గంటల్లో అకౌంట్లో పడతాయి. గతంలో మాన్యువల్ వెరిఫికేషన్, విధానపరమైన జాప్యాల వల్ల క్లెయిమ్స్ ప్రాసెస్ అవ్వడానికి చాలా సమయం పట్టేంది. కానీ ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే క్లియర్ కానున్నాయి. కేవైసీ వివరాలు సరిగ్గా ఉండి అన్ని షరతులు పాటిస్తే కేలం మూడు రోజుల్లో పీఎఫ్ సొమ్ము మీ ఖాతాలోకి చేరుతుంది.

  • UANయూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి
  • ఆధార్‌ను యూఏఎన్‌కు అనుసంధానించాలి ( Aadhaar UAN Link )
  • పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయాలి
  • కేవైసీ (Kyc) పూర్తి చేసి ఉండాలి
  • OTP కోసం మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి.

కొత్త నిబంధనల ప్రకారం.EPF క్లెయిమ్స్ సకాలంలో ప్రాసెసింగ్ జరిగేలా చూసేందుకు 20 రోజుల నిబంధనల విధించారు. అప్పటికీ పూర్తి కాకపోతే బాధ్యులైన అధికారులకు 12% జరిమానా విధిస్తారు. ఈ నిబంధన జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, EPF క్లెయిమ్‌లు నిర్దేశిత కాలపరిమితిలోగా ప్రాసెస్ అయ్యేలా చూడటానికి సహాయపడుతుంది. అలాగే ఆటో సెటిల్మెంట్ పరిమితిని EPFO పెంచింది. గతంలో రూ.లక్షలోపు ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. రూ.5లక్షల్లోపు క్లెయిమ్స్ ఆటో సెటిల్మెంట్ విధానంలో ప్రాసెస్ చేస్తారు. మాన్యువల్ వెరిఫికేషన్ అనేది ఉండదు. దీని వల్ల ముందస్తు విత్ డ్రాలు ఆటోమేటిక్‌గా ప్రాపెస్ చేస్తారు. ఫిజికల్ డాక్యుమెంట్స్ పని లేకపోవడంతో వేగంగా ఖాతాదారులకు డబ్బులు అందుతాయి. వేగంగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేయడం వల్ల వైద్య అత్యవసర పరిస్థితి, విద్య, వివాహం, గృహవసతి, నిరుద్యోగం వంటి విషయాల్లో వేగంగా నగదు పొందవచ్చు. ఇక UAN నెంబర్‌తో ఆధార్ లింక్ చేసినవారు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసి, కేవైసీ పూర్తి చేసినవారికి మరింత వేగంగా క్లెయిమ్స్ అందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)