Ayushman Bharat Scheme :
కేంద్ర ప్రభుత్వం 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుంది కదా అని ధీమాగా ఉంటే.ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ఉంటేనే ఉచిత వైద్యం అందదు.. దానికి కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి. వాటి గురిచి ఈ వీడియోలో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని నడుపుతోంది. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటైన దీని ద్వారా, అర్హులైన కుటుంబాలు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్య ప్రయోజనాలను పొందుతాయి. అంతేకాకుండా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ మరో రూ.5 లక్షల ప్రత్యేక అదనపు కవరేజీని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే చాలామందికి ఈ పథకం నియమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత చికిత్స పొందాలంటే, ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు .
1.లబ్ధిదారుల జాబితాలో పేరు సరిచూసుకోండి :
- కేవలం ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు. ప్రభుత్వ అధికారిక లబ్ధిదారుల జాబితాలో మీ పేరు సరిగ్గా ఉందో లేదో ముందే ఆన్‌లైన్‌లో లేదా సేవా కేంద్రాల్లో చూసుకోండి. పేరు లేదా వివరాల్లో తప్పులు ఉంటే చికిత్స సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
2.ఐడీ కార్డు వెంట ఉంచుకోండి :
- నగదు రహిత చికిత్సను ఆమోదించే ముందు ఆసుపత్రి యాజమాన్యం మీ గుర్తింపును ధృవీకరిస్తుంది. అందుకే ఆయుష్మాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా పాన్ కార్డు వంటి ఒరిజినల్ ఐడీలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
3.జాబితాలో ఉన్న ఆసుపత్రులను మాత్రమే ఎంచుకోండి :
- ఈ పథకం కింద ఉచిత వైద్యం కేవలం ఆయుష్మాన్ భారత్ ప్యానెల్‌లో నమోదైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఆసుపత్రిలో చేరే ముందే అక్కడ ఈ సౌకర్యం ఉందో లేదో కనుక్కోవడం ముఖ్యం.
4.వైద్య కవరేజీ వివరాలు అడిగి తెలుసుకోండి :
- ఈ పథకం కింద అనేక రకాల ప్రధాన శస్త్రచికిత్సలు, ఆసుపత్రి ఖర్చులు కవర్ అవుతాయి. అయినప్పటికీ కొన్ని రకాల ప్రత్యేక చికిత్సలు లేదా కాస్మెటిక్ సేవలు దీని కిందకు రాకపోవచ్చు. కాబట్టి మీకు అవసరమైన చికిత్సకు నగదు రహిత కవరేజీ వర్తిస్తుందో లేదో ముందే ఆసుపత్రి సిబ్బందిని అడగండి.
6.మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోండి :
- మీ ఆయుష్మాన్ ఖాతాతో అనుసంధానించబడిన మొబైల్ నంబర్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. చికిత్స అనుమతులు, ఓటీపీలు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన సందేశాలు ఈ నంబర్‌కే వస్తాయి.
7.కుటుంబ సభ్యుల వివరాల ధృవీకరణ :
- ఈ పథకం ప్రయోజనాలకు అర్హులైన మీ కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు వివరాలు కార్డులో సరిగ్గా నమోదయ్యాయో లేదో చూసుకోండి. ఏదైనా సమాచారం లోపించినా ఆసుపత్రి అడ్మిషన్ సమయంలో సమస్యలు రావచ్చు.
* డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి :
- ఆయుష్మాన్ భారత్ కింద అనుమతించబడిన చికిత్సలకు రోగి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏ ఆసుపత్రి అయినా ఉచిత చికిత్స పరిధిలోకి వచ్చే వైద్యానికి డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.
పేద కుటుంబాలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే ఆయుష్మాన్ భారత్ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ నియమాలను ముందుగానే తెలుసుకొని, సరైన ఆసుపత్రిని ఎంచుకోవడం ద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా అత్యవసర సమయంలో వేగంగా ఉచిత వైద్య సేవలను అందుకోవచ్చు.