Gmail Username Change :
Gmail అనేది ప్రతీఒక్కరికీ అవసరం. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు మరింత అవసరం. ఏమైనా పెద్ద సైజు డాక్యుమెంట్స్ సులువుగా పంపించుకోవచ్చు. అయితే ఒక్కసారి యూజర్ నేమ్ సెట్ చేసుకున్నాక ఇప్పటివరకు మార్చుకునే ఆప్షన్ లేదు. అయితే ఇక నుంచి మీరు ఎప్పుడైనా యూజర్ ఐడీ మార్చుకోవచ్చు.

Gmail వాడేవారికి google గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి మీరు మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు. మెయిల్ ఐడీ యూజర్ నేమ్‌ను ఛేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో ఉండే @జీమెయిల్.కామ్ మినహా మిగతా పేరును సలువుగా మార్చుకోవచ్చు. ప్రత్యేక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న ఐడీ పేరును మీరు సులభంగా ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ మేరకు గూగుల్ అవకాశం కల్పిస్తోంది. ఇది ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఉన్న మెయిల్ ఐడీ పేరును మీరు మార్చుకోవచ్చు :
యూజర్ నేమ్ అందుబాటులో లేకపోయినా లేదా అవగాహన లేకనో చాలామంది ఒక యూజర్ నేమ్‌తో మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుని ఉంటారు. ఆ మెయిల్ ఐడీని ఎన్నో సంవత్సరాలుగా వాడుతూ ఉంటారు. ఒక్కసారి క్రియేట్ చేసుకున్నాక మెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవడం కుదరడం లేదు. దీంతో కొత్తగా మరో మెయిల్ క్రియేట్ చేసుకునేవారు. ఇక నుంచి అలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఉన్న మెయిల్ ఐడీ పేరును మీరు మార్చుకోవచ్చు. దీని వల్ల వేరే మెయిల్‌ను వాడాల్సిన అవసరం ఉండదు. ఒక మెయిల్‌లోనే అన్నీ పనులు నిర్వహించుకోవచ్చు. గత ఏడాది ఈ ఫీచర్ తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించగా.. ఇప్పుడు ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Gmail యూజర్ నేమ్ మార్చుకోవడం ఎలా :
- మీ జీమెయిల్‌లో లాగిన్ అవ్వండి
- గూగుల్ అకౌంట్ మేనేజ్‌మెంట్ ఆప్షన్‌లోకి వెళ్లండి
- పర్సనల్ ఇన్పోలోకి వెళ్లి ఈమెయిల్ ఆప్షన్ ఎంచుకోండి
- గూగుల్ అకౌంట్ ఈమెయిల్ ఆప్షన్ కనిపిస్తుంది
- అక్కడ మీకు నచ్చిన, అందుబాటులో ఉన్న నేమ్‌ను సెటప్ చేసుకోండి
- అనంతరం సేవ్ చేసుకుంటే సరిపోతుంది
- మీ జీమెయిల్ యూజర్ నేమ్ సెకన్లలోనే మారిపోతుంది.
యూజర్ నేమ్ మార్చుకోవడం వల్ల సమస్య ఏమైనా వస్తుందా :
యూజర్ నేమ్ మార్చుకోవడం వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా అంటే.. కొన్ని ఇబ్బందులు తప్పవు. చాలా యాప్స్, వెబ్‌సైట్లలో మీ పాత యూజర్ నేమ్‌తో లాగిన్ అయి ఉంటారు. దీంతో మీరు లాగిన్ అవ్వాలంటే మళ్లీ కొత్త యూజర్ నేమ్‌తో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల యాప్స్‌లలో మీ పాత డేటా, సబ్‌స్క్రిప్షన్లు కనిపించకుండా పోయే అవకాశముంది. ఇక బ్యాంక్ అకౌంట్లు, ఆఫీసు పనుల కోసం పాత మెయిల్ ఐడీ ఇచ్చి ఉంటారు. దీంతో కొత్త మెయిల్ ఐడీ అందించాల్సి ఉంటుది.