YouTube Monetization New Rules :
YouTube ఆగస్టు 10 నుంచి కొత్త మానిటైజేషన్ విధానాన్ని ప్రకటించింది. దీని ప్రభావం వచ్చే నెల నుండి కనిపిస్తుంది. YouTube కంటెంట్ క్రియేటర్లు డబ్బు సంపాదించడానికి ఈ కొత్త మానిటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది.

మీరు యూట్యూబ్‌లో వీడియోలు చేసి డబ్బు సంపాదిస్తున్నా, లేదా అలా చేయాలని ఆలోచిస్తున్నా, మీకోసమే ఈ వార్త. కంటెంట్ క్రియేటర్ల నుండి డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ తన నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పుడు యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) కింద ప్రకటనలు, యూట్యూబ్ ప్రీమియం ద్వారా డబ్బు సంపాదించడానికి మీరు గతంలో కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపెనీ అవసరమైన వ్యూస్, వాచ్‌టైమ్ రెండింటినీ పెంచింది.
కొత్త కంటెంట్ క్రియేటర్ల కు కష్టతరం :
- యూట్యూబ్‌కు కొత్తగా వచ్చిన వారికి, డబ్బు సంపాదించే ప్రయాణం దాదాపు రెండింతలు కష్టంగా మారింది. కొత్త నిబంధనలతో డబ్బు సంపాదించడం ఇకపై సులభం కాదు.
- 8,000 వాచ్ అవర్స్ : YouTube Content Creators ఇప్పుడు ఒక సంవత్సరంలోపు 8,000 వాచ్ఆవర్స్లను చేరుకోవాలి. గతంలో ఈ పరిమితి కేవలం 4,000 గంటలు మాత్రమే ఉండేది.
- 2 కోట్ల షార్ట్స్ వ్యూస్‌లు : యూట్యూబ్ షార్ట్స్ నుండి సంపాదించడానికి ఇప్పుడు మీరు 90 రోజుల్లో 1 కోటి (10 మిలియన్లు) కాదు, 2 కోట్ల (20 మిలియన్లు) వ్యూస్ పొందవలసి ఉంటుంది.
- 1000 మంది సబ్స్క్రైబర్లు : ఈ ప్రాథమిక నియమం యథాతథంగా కొనసాగుతుంది. ఒక ఛానెల్‌కు కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలనే నిబంధన అమలులో ఉంటుంది.
ఈ నియమాలు పాత కంటెంట్ క్రియేటర్ల కు కూడా వర్తిస్తాయా :
ఈ కొత్త నియమాలు ఇప్పటికే సంపాదిస్తున్న క్రియేటర్లకు కూడా వర్తిస్తాయి. యాడ్స్, సబ్స్క్రిప్షన్ల ద్వారా షార్ట్స్ వీడియోల నుండి డబ్బు సంపాదించడానికి వారు ప్రతి 90 రోజులకు కనీసం 10 మిలియన్ల వ్యూస్‌ను కూడా సాధించాలి. ఒకవేళ క్రియేటర్ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే వారి షార్ట్స్ వీడియోల ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. అయితే నిడివి ఎక్కువ ఉన్న వీడియోల నుండి వచ్చే ఆదాయం కొనసాగుతుంది. షార్ట్స్ వ్యూస్ 10 మిలియన్లు దాటిన తర్వాత ఆదాయం ఆటోమేటిక్‌గా తిరిగి ప్రారంభమవుతుంది.
YouTube గతంలో 2018లో తన మానిటైజేషన్ పాలసీలో ఒక పెద్ద మార్పు చేసింది. ఆ తర్వాత కొన్ని చిన్న షరతులు జోడించింది. కానీ ఈ ప్రధాన మార్పు ఇప్పుడు జరిగింది. ప్రస్తుతం యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా క్రియేటర్లు చురుకుగా ఉన్నారు. యూట్యూబ్‌లో ప్రతిరోజూ షార్ట్స్ వీడియోలు 20 బిలియన్లకు కంటే ఎక్కువ సార్లు వీక్షిస్తున్నారు. ఈ కొత్త పాలసీతో కంపెనీ ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించాలనుకుంటోంది.