వాస్తు శాస్త్రంలో దక్షిణ దిశ ప్రాముఖ్యం:
సాధారణంగా ఇంట్లో శాంతి, సంతోషం లేదా సంపద గురించి ఆలోచించినప్పుడు మన దృష్టి ఎక్కువగా ఉత్తరం లేదా తూర్పు దిశలపై ఉంటుంది. ఉత్తరం కుబేరుడి దిక్కు అని, అక్కడి నుంచే లక్ష్మీదేవి కృప లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రంలో మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది.. అదే దక్షిణ దిశ. వాస్తు ప్రకారం, ఇంటి దక్షిణ దిశను సరిగా నిర్వహిస్తే వృత్తి స్థిరపడటమే కాకుండా సంపద ప్రవాహం కూడా మెరుగవుతుందని నమ్మకం. ఒకవేళ ఆర్థికంగా నిలకడ లేకపోయినా లేదా అభివృద్ధి మందగించినట్లు అనిపించినా, దక్షిణ దిశలో ఈ క్రింది మార్పులను ప్రయత్నించవచ్చు.

జేడ్ మొక్క ఈ దిశలో ఉంచితే …
జేడ్ మొక్కను సాధారణంగా “డబ్బు మొక్క” అని కూడా అంటారు. ఇది సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆకర్షించే మొక్కగా పరిగణించబడుతుంది. హాల్ లేదా డ్రాయింగ్ రూమ్లో దక్షిణ దిశలో ఉంచితే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని వాస్తు నమ్మకం.

పరుగెత్తే ఏడు గుర్రాలు చిత్రాన్ని గోడపై ఉంచడం …
అభివృద్ధి, వేగం, శక్తికి గుర్రాలు ప్రతీకలు. ముఖ్యంగా ఏడు గుర్రాల చిత్రాన్ని దక్షిణ గోడపై ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. గుర్రాల ముఖాలు లోపలికి చూస్తూ ఉండేలా ఉంచితే వృత్తి, వ్యాపారంలో అడ్డంకులు తొలగి వేగవంతమైన పురోగతి కలుగుతుందని నమ్మకం.

ఫీనిక్స్ పక్షి చిత్రం …
వాస్తు శాస్త్రంలో ఫీనిక్స్ పక్షిని శక్తి, విజయం, పునర్జన్మకు చిహ్నంగా భావిస్తారు. ఇది ప్రతికూల పరిస్థితుల నుంచి తిరిగి ఎదిగే శక్తిని సూచిస్తుంది. దక్షిణ గోడపై ఫీనిక్స్ చిత్రాన్ని ఉంచితే ప్రతికూలత తొలగిపోయి విజయానికి మార్గం సుగమం అవుతుందని నమ్మకం. కీర్తి, గుర్తింపు కోరుకునేవారికి ఇది ఎంతో అనుకూలం.

Disclaimer : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.