June 4, 2026

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) మార్చిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 8.25% వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించింది. కానీ కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడిచినా, తమ EPF ఖాతాలలో వడ్డీ ఇంకా జమ కాకపోవడంతో చాలా మంది ఈపీఎఫ్‌ ​​చందాదారులు వడ్డీ కోసం ఎదురు చూస్తున్నారు. వడ్డీ జమ చేయడంలో ఇంతటి జాప్యం వల్ల తాము కొంత నగదును కోల్పోతామేమోనని చాలా మంది ఆలోచించడం మొదలుపెట్టారు.

 EPFO : భారత ప్రభుత్వం వడ్డీ రేటును అధికారికంగా తెలియజేస్తుందని, ఆ తర్వాత EPFO ​​ఆ వడ్డీ రేటును చందాదారుల ఖాతాలో జమ చేస్తుందని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈపీఎఫ్‌ వడ్డీని జమ చేసేందుకు ఈపీఎఫ్‌వో ​​ఎటువంటి నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు.మీ ఈపీఎఫ్‌ వడ్డీ ఇంకా జమ కాకపోతే సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని BankBazaar.com CEO అధిల్ శెట్టి ఈటీ వెల్త్ ఆన్‌లైన్‌కు తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఈపీఎఫ్‌వో ​​వడ్డీని జమ చేయదని, ఎందుకంటే ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఆమోదం, ఖాతాల సయోధ్య, లక్షలాది సభ్యుల రికార్డులను అప్‌డేట్‌ చేయడం వంటివి ఉంటాయని, వీటికి చాలా వారాలు పట్టవచ్చని శెట్టి చెప్పారు.

EPFO : మార్చి మొదటి వారంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.25% వద్దే కొనసాగిస్తామని ఈపీఎఫ్‌వో ​​ప్రకటించింది. కార్మిక,ఉపాధి మంత్రిత్వ శాఖ మార్చి 2, 2026న ఒక పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొంది: “తగిన చర్చల అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఖాతాలలో జమ అయిన EPF మొత్తాలపై 8.25% వార్షిక వడ్డీ రేటును జమ చేయాలని CBT సిఫార్సు చేసింది.” అని పేర్కొంది.

EPFO : 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.25% వడ్డీ లభిస్తుంది. మీ పాస్‌బుక్‌లో ఎంట్రీ ఇంకా కనిపించకపోయినా, అర్హత ఉన్న బ్యాలెన్స్‌లపై వడ్డీ జమ అవుతుంది. సభ్యులు తమ ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌లో ‘Int. Updated up to 31/03/2026’ అని గుర్తించిన అప్‌డేట్ కోసం ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. చాలా సందర్భాలలో ఇది కనిపించడంలో ఆలస్యం అవుతుందని భావించవద్దని, సభ్యునికి రావలసిన వడ్డీ మొత్తాన్ని ప్రభావితం చేయదని అన్నారు.

EPFO : 2025 లో చాలా మంది ఈపీఎఫ్‌ సభ్యులకు జూన్- జూలై నెలల్లో వారి వారి ఖాతాలకు వడ్డీ జమ చేశారు. గతంలో వడ్డీ సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో జమ చేసేదని, ఇప్పుడు ఈ ప్రక్రియ వేగవంతమైందని నిపుణులు అంటున్నారు. అయితే, ఈసారి ఇది జూన్, జూలై నెలల్లో జమ కావచ్చు. ఏదేమైనా, ఈపీఎప్‌ వడ్డీ జమ అయ్యే అసలు తేదీ ప్రభుత్వ నోటిఫికేషన్ తర్వాతే తెలుస్తుంది. ఈపీఎఫ్‌వో ​​వడ్డీని జమ చేసినప్పుడల్లా అది మీ EPF బ్యాలెన్స్‌లో కనిపిస్తుంది. అందుకే దాని కోసం మీరు మీ ఈపీఎప్‌ బ్యాలెన్స్‌ను తనిఖీ చేస్తుండాలి. ఈ బ్యాలెన్స్‌ను ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించడం ద్వారా, ఈపీఎఫ్‌ సభ్యుల ఇ-సేవా పోర్టల్‌ను సందర్శించడం ద్వారా, మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, SMS పంపడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)