June 21, 2026

భూమి కొలతలు అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిన ముఖ్యమైన అంశం. ముఖ్యంగా భవిష్యత్తులో భూమి లేదా ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సమాచారంతో మీ భూమి వైశాల్యాన్ని సరిగ్గా లెక్కించవచ్చు.అంగుళం నుంచి హెక్టార్ వరకు వివిధ భూమి కొలత యూనిట్లు, వాటి మధ్య ఉన్న సంబంధాలు, మార్పిడులను వివరంగా తెలుసుకుందాం.

  • కొలతల్లో అతి చిన్న యూనిట్లలో అంగుళం ఒకటి.
  • 1 అంగుళం = 2.54 సెంటీమీటర్లు
  • పొడవును కొలవడానికి సాధారణంగా ఉపయోగించే యూనిట్.
  • 1 అడుగు = 12 అంగుళాలు
  • గజం కూడా పొడవును కొలిచే యూనిట్.
  • 1 గజం = 3 అడుగులు
  • భూమి వైశాల్యాన్ని కొలిచేటప్పుడు చదరపు గజం (Square Yard) ఉపయోగిస్తారు.
  • 1 చదరపు గజం = 3 అడుగులు × 3 అడుగులు = 9 చదరపు అడుగులు
  • గుంట అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే భూమి కొలత.
  • ఒక గుంట వైశాల్యం : 11 గజాల పొడవు × 11 గజాల వెడల్పు
    1 గుంట = 121 చదరపు గజాలు
    1 గుంట = 1089 చదరపు అడుగులు

దక్షిణ భారతదేశంలో భూమిని కొలవడానికి ‘సెంట్’ ను ఒక యూనిట్‌గా ఉపయోగిస్తారు. 1 ఎకరంలో 100 వ వంతు భాగాన్ని ఒక సెంట్ అంటారు.

  • సెంట్ కూడా భూమి కొలతలో విస్తృతంగా ఉపయోగించే యూనిట్.
  • 1 గుంట = 2.5 సెంట్లు
    1 సెంట్ = 435.6 చదరపు అడుగులు (sq ft)
    1 సెంట్ = 48.4 చదరపు గజాలు
  • భూమి కొలతల్లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే యూనిట్ ఎకరం.
  • ఒక ఎకరం అంటే :
    1 ఎకరం = 40 గుంటలు
    1 ఎకరం = 100 సెంట్లు

    1 ఎకరం = 4840 చదరపు గజాలు
    1 ఎకరం = 43,560 చదరపు అడుగులు
  • హెక్టార్ అనేది అంతర్జాతీయంగా ఉపయోగించే భూమి కొలత యూనిట్.
  • 1 హెక్టార్ = 10,000 చదరపు మీటర్లు
    1 హెక్టార్ = 2.471 ఎకరాలు
  • వ్యవసాయ భూములు, పరిశ్రమలు, చేపల చెరువులు వంటి పెద్ద విస్తీర్ణాలను కొలవడానికి హెక్టార్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • 1 అడుగు = 12 అంగుళాలు
  • 1 గజం = 3 అడుగులు
  • 1 చదరపు గజం = 9 చదరపు అడుగులు
  • 1 గుంట = 121 చదరపు గజాలు
  • 1 గుంట = 1089 చదరపు అడుగులు
  • 1 గుంట = 2.5 సెంట్లు
  • 1 సెంట్ = 48.4 చదరపు గజాలు
  • 1 సెంట్ = 435.6 చదరపు అడుగులు
  • 1 ఎకరం = 40 గుంటలు
  • 1 ఎకరం = 100 సెంట్లు
  • 1 ఎకరం = 4840 చదరపు గజాలు
  • 1 ఎకరం = 43,560 చదరపు అడుగులు
  • 1 హెక్టార్ = 10,000 చదరపు మీటర్లు
  • 1 హెక్టార్ = 2.471 ఎకరాలు


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)