Aadhaar Card Download in WhatsApp :
భారతదేశం లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణ పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ప్రభుత్వ సేవలు, ఆర్థిక కార్యకలాపాలు, రోజువారీ ధృవీకరణ కోసం ఇది అవసరమవుతుంది. దీంతో ఈ కార్డును ఎప్పుడూ మన వెంట ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ పథకాలు పొందటం నుంచి ఏదైనా ప్రూఫ్ వరకు ఆధార్ కార్డు అనేది అవసరం. అయితే మీరు ఇంటి దగ్గర ఆధార్ కార్డును మర్చిపోవడం లేదా ఫోన్‌లో డాక్యుమెంట్ లేని సమయంలో పోర్టల్ లేదా డిజిలాకర్ యాప్ నుండి డౌన్‌లోడ్ చేసుకుంటారు. అయితే మీరు వాటి అవసరం లేకుండానే వాట్సప్ ద్వారా సులభంగా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు కేంద్ర ప్రభుత్వ అధికారిక MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ను ఉపయోగించి వాట్సాప్‌లోనే సెకన్ల వ్యధిలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ద్వారా అదనపు యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకుండానే ఆధార్, ఇతర ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఫోన్‌లో…
- ఆధార్‌తో అనుసంధానించబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్
- యాక్టివ్‌గా ఉన్న డిజిలాకర్ ఖాతా
- మీ ఫోన్‌లో MyGov హెల్ప్‌డెస్క్ వాట్సాప్ నంబర్ 9013151515 సేవ్ చేసుకుని ఉండాలి.
ఆధార్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?
- మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో 9013151515 నంబర్‌ను “MyGov హెల్ప్‌డెస్క్” పేరుతో సేవ్ చేసుకోండి.
- వాట్సాప్ ఓపెన్ చేసి ఈ కాంటాక్ట్‌తో చాట్ ప్రారంభించండి.
- “నమస్తే” లేదా “హాయ్” అని టైప్ చేయండి.
- “డిజిలాకర్ సర్వీసెస్” ఆప్షన్ ఎంచుకోండి.
- మీకు ఇప్పటికే డిజిలాకర్ ఖాతా ఉందో లేదో నిర్ధారించుకోండి. లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
- మీ 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయండి.
- మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి.
- అనంతరం చాట్‌బాట్ మీ డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.
- సంబంధిత నంబర్‌ను టైప్ చేయడం ద్వారా జాబితా నుండి ఆధార్‌ను ఎంచుకోండి.
- మీ ఆధార్ కార్డు వాట్సాప్ చాట్‌లో PDF ఫార్మాట్‌లో వస్తుంది.
- మీరు పీడీఎఫ్ ఫైల్ డౌన్ లోడ్ చేసుకుని ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు.