ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త! టీడీఎస్ కోతలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఫారం 121ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన ఈ ఫారం, పాత 15G, 15H స్థానంలో వచ్చింది.

ముందుగా ముఖ్యమైన రూల్ – 5 Years Rule :
- మీరు ఒక కంపెనీలో లేదా multiple కంపెనీల్లో కలిపి 5 సంవత్సరాలు Work complete చేస్తే : PF withdraw చేసినా TDS ఉండదు
- కానీ 5 సంవత్సరాలు పూర్తి కాకముందే withdraw చేస్తే TDS పడుతుంది.
- మీరు withdraw చేసే amount ₹50,000 కంటే ఎక్కువ అయితేనే TDS వర్తిస్తుంది ₹50,000 లోపు ఉంటే ఎలాంటి TDS ఉండదు.
PAN CARD Importance :
మీరు PAN number ఇవ్వడం చాలా ముఖ్యం –
1. PAN ఇచ్చినట్లయితే → సాధారణంగా 10% TDS
2. PAN ఇవ్వకపోతే → 20% వరకు TDS deduct అవుతుంది
Job Change & PF Transfer :
👉 మీరు job change చేసినప్పుడు PF transfer చేసుకుంటే అది continuous service గా పరిగణిస్తారు అంటే
5 years complete అయినట్లు తీసుకుంటారు → TDS ఉండదు
కొన్ని special పరిస్థితుల్లో:
- Health issues
- Company close అవ్వడం
- Employer వల్ల job loss
👉 ఈ సందర్భాల్లో 5 years పూర్తి కాకపోయినా TDS ఉండదు.
TDS Refund ఎలా పొందాలి?
TDS deduct అయినా tension అవసరం లేదు!
👉 మీ income taxable కాకపోతే ITR file చేసి → TDS refund తీసుకోవచ్చు .
EPFO పాత ఫారమ్‌లు 15G, 15H స్థానంలో కొత్తగా ఫారం 121 ను ఉపయోగించాల్సి ఉంటుంది :
ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. EPFO ప్రకారం.. పాత ఫారమ్‌లు 15G, 15H స్థానంలో కొత్తగా ఫారం 121ను ప్రవేశపెట్టనుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు 60 సంవత్సరాల లోపు వారు ఫారం 15G, సీనియర్ సిటిజన్లు ఫారం 15H సమర్పించేవారు. అయితే ఇకపై ఈ రెండింటి స్థానంలో ఒకే ఫారం 121ను ఉపయోగించాల్సి ఉంటుంది. పన్ను బాధ్యత సున్నాగా ఉన్నవారు, అంటే తమ ఆదాయం పన్ను పరిమితికి దిగువన ఉన్నవారు, టీడీఎస్ (TDS) కోతలను నివారించేందుకు ఈ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది.
ఫారం 121ను భారతదేశంలో నివసించే వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUF), ఇతర అర్హులైన వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు. అయితే కంపెనీలు, సంస్థలు, అలాగే ఎన్నారైలకు ఈ ఫారం వర్తించదు. మొత్తం అంచనా ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోవడం ఈ ఫారం సమర్పించడానికి ప్రధాన షరతుగా ఉంటుంది. ఫారం 121 ఒక స్వీయ-ప్రకటన పత్రంగా పనిచేస్తుంది. దీన్ని EPFO, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలకు సమర్పించినట్లయితే, టీడీఎస్ కోతలు జరగవు. ప్రతి ఫారానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UIN) కూడా ఇవ్వబడుతుంది. ఈ సంఖ్యలో క్రమ సంఖ్య, పన్ను సంవత్సరం, TAN వంటి వివరాలు ఉంటాయి.
ఇక పాత ఫారమ్‌ల విషయానికి వస్తే ఏప్రిల్ 1 తర్వాత కూడా 15G లేదా 15H సమర్పించినా అవి వెంటనే తిరస్కరించబడవు. అయితే తర్వాత ఫారం 121 సమర్పించాలని కోరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొత్త ఫారం 121ను మరింత సులభతరం చేసే విధంగా రూపకల్పన చేశారు. ఇందులో ఆటో-ఫిల్ సమాచారం, రియల్-టైమ్ ఎర్రర్ చెక్, డ్రాప్‌డౌన్ ఎంపికలు, సులభమైన ధృవీకరణ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఫైలింగ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పొరపాట్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.